

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్‌పైనే ఇండస్ట్రీ దృష్టి ఉంది. ముంబైలో 50 రోజుల భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత, బన్నీ హైదరాబాద్‌కు చేరుకోగా, అట్లీ సైతం సిటీకి వచ్చేశాడు. ఇదే సమయంలో ఇద్దరూ కలిసి నెట్‌ఫ్లిక్స్ టీంని కలవడం ఫిల్మ్‌నగర్ లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ మీటింగ్‌లో నెట్‌ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బెలా బజారియా , బన్నీ తండ్రి అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. ఈ మీటింగ్ వెనుక అసలు డీల్ ఏమిటి? నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసమేనా? లేక ఇంకా పెద్ద ప్లాన్ ఉందా? అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది.
ఇక అట్లీ – బన్నీ కాంబో సినిమా వచ్చే షెడ్యూల్ అక్టోబర్‌లో అబూదాబిలో జరగనుంది. టాప్ హీరోయిన్స్ అందరూ ఆ షెడ్యూల్‌లో జాయిన్ అవుతారని టాక్. భారతీయ సినీ పరిశ్రమలోనే ఖరీదైన ప్రాజెక్ట్‌గా ఇది రూపొందుతుందని బజ్. 2026 అక్టోబర్ నాటికి షూట్ పూర్తి చేసి, 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మైటీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ మేక్ చేస్తోంది.
అల్లు అర్జున్ – అట్లీ – నెట్‌ఫ్లిక్స్ కాంబినేషన్.. ఇది కేవలం సినిమా మాత్రమేనా? లేక గ్లోబల్ గేమ్‌చేంజర్ ప్రాజెక్ట్‌నా?
ఇక ఇందులో అల్లు అర్జున్ (Allu Arjun) పాత్ర మూడు కోణాల్లో సాగుతుందని సమాచారం. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగంతోపాటు… విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ సందడి చేయనున్నారు.