బింబిసార హిట్ తర్వాత డైరక్టర్ విశిష్ట మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే . మూడు లోకాల మధ్య సాగే స్టోరీతో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‍గా నటిస్తున్నారు. అషిక రంగనాథ్, ఇషా చావ్లా, రమ్య, కునాల్ కపూర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మెగా యంగ్ హీరో సాయి దుర్గా తేజ్ క్యామియో రోల్‍లో కనిపిస్తారని తెలుస్తోంది. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ మాత్రం రావటం లేదు.

వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ మూవీ..గేమ్ ఛేంజర్ సినిమా సీన్ లోకి రావటంతో వాయిదా పడింది. ఇప్పటి వరకు మరో తేదీ ఫిక్స్ కాలేదు. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి సోషియో ఫ్యాంటసీ జానర్ చేస్తుండటంతో విశ్వంభరపై మరింత హైప్ ఉంది. ఈ చిత్రానికి విశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా, విశ్వంభర సినిమా విడుదల తేదీపై క్రేజీ రూమర్ బయటికి వచ్చింది.

ఇంద్ర సినిమా 2002 జూలై 24వ తేదీన విడుదలైంది. ఆ చిత్రం అప్పట్లో ఆల్‍టైమ్ ఇండస్ట్రీ హిట్ అయింది. చిరంజీవి కెరీర్లో ప్రత్యేకమైన మూవీగా నిలిచింది. అందుకే ఈ సెంటిమెంట్‍ను ఫాలో అయి విశ్వంభరను జూలై 24న విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారని టాక్.

విశ్వంభర సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్, వంశీ, విక్రమ్ నిర్మిస్తున్నారు. రూ.100కోట్లకు పైగా బడ్జెట్ ఈ మూవీకి ఖర్చైందని తెలుస్తోంది. ఈ చిత్రంలో వీఎఫ్‍ఎక్స్ భారీగా ఉండనుంది. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

, , ,
You may also like
Latest Posts from