హీరో నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా ఈరోజే థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో… సినిమా పట్ల ఆసక్తి గణనీయంగా తగ్గిపోయింది. అభిమానులు సహా పలు వర్గాల ప్రేక్షకులు కూడా… “ఓటిటిలో చూసేద్దాం” అన్న తీర్మానానికి వచ్చేశారు.
ఓటిటి హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కు – ఆగస్టులో డిజిటల్ రిలీజ్ అవకాశం
ఈ సినిమాకు డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ పొందింది. థియేట్రికల్ రన్ ముగిశాక నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధిలో సినిమా ఓటిటీలోకి రావచ్చు. అందువల్ల, తమ్ముడు సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు మధ్యలో స్ట్రీమింగ్‌కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిర్మాతల నుంచి అధికారిక తేదీ మాత్రం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
ఓవైపు థియేటర్లలో నెగటివ్ రిపోర్ట్స్… మరోవైపు ఓటిటీలో చూసేయాలన్న తహతహ… ‘తమ్ముడు’ ఓటిటి డేట్ మీద మరింత ఆసక్తిని పెంచుతోంది.