‘భీష్మ’ చిత్రంతో మెప్పించిన జోడీ నితిన్-వెంకీ కుడుముల. మళ్లీ వీరి కలయికలో తెరకెక్కిన చిత్రం.. రాబిన్ హుడ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ చిత్రం.. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ఈ నేపధ్యంలో అసలు ఈ చిత్రం బిజినెస్ ఎంత అయ్యింది. ఎంతొస్తే రికవరీ అవుతుందనే విషయాలు ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ. 27.50 కోట్లు జరిగిందని తెలుస్తోంది. నితిన్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ బిజినెస్‌గా నిలిచింది. గతంలో నితిన్ చేసిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రూ. 24.20 కోట్ల బిజినెస్ సాధించగా, అది ఆశించిన స్థాయిలో రాబడి ఇవ్వలేదు.
అలాగే ‘మాచర్ల నియోజకవర్గం’ రూ. 21.20 కోట్లు, ‘రంగ్ దే’ రూ. 23.90 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ ఫైనల్ వసూళ్లలో అంచనాల స్థాయికి వెళ్లలేకపోయాయి. అయితే ఇప్పుడీ సినిమా టాక్ తేడాగా ఉండటంతో బ్రేక్ ఈవెన్ అవుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఏదైమైనా రాబిన్ హుడ్ చిత్రం పెద్ద రిస్క్ తోనే మన ముందుకు వచ్చిందంటున్నారు.
ఏదైమైనా నితిన్‌కు కమర్షియల్‌గా ఓ బ్లాక్‌బస్టర్ అవసరం. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 40 కోట్లు గ్రాస్ రావాలి. 28 కోట్లు షేర్ రావాలి. ఈ స్దాయి రికవర్ చేయాలంటే వర్డ్ ఆఫ్ మౌత్ బలంగా ఉండాలి. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ వస్తే, నితిన్ మరోసారి తన ఫామ్‌కు తిరిగొచ్చినట్టే. అది ఏ మేరకు అనేది చూడాలి.