సినిమాల్లో తన యూనిక్ కామెడీ టైమింగ్‌తో, ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఆయనకు రెండు కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ కావడంతో, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. వైద్యుల సూచనల మేరకు తీవ్రంగా కిడ్నీ మార్పిడి అవసరం అయిన పరిస్థితి.

ఇటీవల మీడియాలో హీరో ప్రభాస్ రూ.50 లక్షలు సాయం చేశారంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆసుపత్రి ఖర్చులన్నీ కూడా ఆయన భరిస్తున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఇవన్నీ అవాస్తవాలు అని, ఇప్పటివరకు ప్రభాస్ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని వెంకట్ కుటుంబసభ్యులు తమంతట తామే క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ విషయమై ప్రభాస్‌కు తెలిసినపుడే ఆయన స్పందిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు వెంకట్ భార్య.

ఇక మరోవైపు… కిడ్నీ దానం చేసేందుకు కొంతమంది ముందుకు వస్తున్నా, వారు రూ.30 లక్షల వరకు డిమాండ్ చేస్తుండటంతో ఆ మొత్తాన్ని మోయడం కుటుంబానికి అసాధ్యమవుతోంది. ప్రస్తుతం వారిదగ్గర ఉన్న సొమ్ము తక్కువ కావడంతో, దాతలు, సినీ ప్రముఖులు, ఇతర మానవతా భావం ఉన్నవారు ముందుకు రావాలని వారు వేడుకుంటున్నారు.

వెంకట్ ఆరోగ్యం గత కొంతకాలంగా నిలకడగా లేదు. మరోవైపు అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆర్థికంగా కూడా బాగా కష్టాలనెదుర్కొంటున్నారు. రోజువారీ ఖర్చులు కూడా భారంగా మారుతున్నాయని, ప్రస్తుత పరిస్థితి చాలా విషాదంగా ఉందని సన్నిహితులు చెబుతున్నారు.

,
You may also like
Latest Posts from