
పబ్లిసిటీ కాదు… సైకాలజీ! రాజమౌళి రూట్ ఫాలో అయితేనే సక్సెస్ గ్యారెంటీ!
టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక్క హీట్ టాపిక్ — రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న SSMB29! ఇది కేవలం సినిమా కాదు, సినిమా మేకింగ్, మార్కెటింగ్ రెండింటినీ రీడిఫైన్ చేసే ప్రాజెక్ట్!
బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత జక్కన్న నుంచి వచ్చే సినిమా అంటే ప్రపంచం చూస్తుంది. అదీ మహేష్ బాబుతో అంటే… ఊహించుకోండి హైప్ రేంజ్! కానీ ఈసారి రాజమౌళి తీసుకున్న పబ్లిసిటీ రూట్ మాత్రం పూర్తిగా భిన్నం — నాయిస్ కాదు, సైలెన్స్‌తోనే హైప్ క్రియేట్ చేస్తున్నారు!
సైలెంట్ డ్రాప్, లౌడ్ బజ్!
తాజాగా వచ్చిన “సంచారి” సాంగ్ ని ఎవరూ ముందుగా అంచనా వేయలేదు. ఏ పోస్టర్ లేదు, ఏ టీజర్ లేదు — ఒక్కసారిగా Apple Musicలో పడింది, తర్వాత యూట్యూబ్‌లోకి దూకి, సోషల్ మీడియాలో దుమ్ము రేపింది!
సినిమా యూనిట్ నుంచి ఒక్క మాటా లీక్ కాకుండా ఇలా సడన్ రిలీజ్ చేయడం — రాజమౌళి స్టైల్‌లో క్లాసిక్ మైండ్ గేమ్. సైలెంట్ డ్రాప్ పబ్లిసిటీ కంటే ఎక్కువ పంచ్ ఇచ్చిందంటూ ఇండస్ట్రీలో టాక్.
టీవీలో కాదు… ఓటీటీలోనే ఈవెంట్!
మహేష్ బాబు సినిమా ఈవెంట్ అంటే టీవీ ఛానల్స్ క్యూలో నిలబడతాయి. కానీ ఈసారి జక్కన్న తీసుకున్న నిర్ణయం వేరే లెవెల్‌ది SSMB29 గ్లింప్స్ ఈవెంట్ ఎక్స్‌క్లూజివ్‌గా Jio Cinema & Hotstarలో మాత్రమే స్ట్రీమ్ కానుంది.
ఇది తెలుగు సినిమాకు కొత్త మార్కెటింగ్ పంథా. సాధారణ ఈవెంట్ కాదు, ఇది ఒక డిజిటల్ బ్లాక్‌బస్టర్ లాంచ్ ప్లాన్! ఇండస్ట్రీ టాక్ — “రాజమౌళి ప్రమోషన్‌కి కొత్త డెఫినిషన్ ఇచ్చేశాడు.”
రాజమౌళి స్ట్రాటజీ వెనక మాంత్రికం!
ఇప్పటి హీరోలు పబ్లిసిటీ కోసం పది పోస్టర్లు, ఐదు టీజర్లు వదులుతారు. కానీ రాజమౌళి మాత్రం సైలెన్స్‌లో స్ట్రాటజీని దాచిపెడతాడు.
అదే బజ్ క్రియేట్ చేసే సీక్రెట్. “ఫ్యాన్స్ ఊహల్లో నడిచే ప్రమోషన్” — అదే జక్కన్న ఫార్ములా!
మహేష్ బాబు ప్రెజెన్స్‌నే పబ్లిసిటీగా మార్చేస్తూ, జక్కన్న ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్త పాఠం చెబుతున్నాడు .
“అప్‌డేట్ కాదు… అంచనా రేపేలా చేయాలి!”
నవంబర్ 15 గ్లింప్స్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది.ఈ ఈవెంట్‌తో రాజమౌళి మళ్లీ ప్రూవ్ చేయబోతున్నాడు — “హైప్ కంటే మిస్టరీ బలంగా ఉంటుంది!”. SSMB29 కేవలం సినిమా కాదు, ఇది టాలీవుడ్‌లో పబ్లిసిటీ పద్ధతులనే తిరగరాయబోతున్న మార్కెటింగ్ మాస్టర్‌పీస్!
