వరుస ఫెయిల్యూర్స్‌తో వెనుకబడిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫుల్ ఫోర్స్‌తో రీ-ఎంట్రీ కోసం రెడీ అయ్యిన సంగతి తెలిసిందే. “కింగ్‌డమ్” అనే హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తున్నాడు. ఈసారి మాత్రం అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఎందుకంటే ఇది డూ ఆర్ డై సిట్యుయేషన్. నిర్మాతలు కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ – ఈ సినిమా మీద మామూలుగా ఖర్చు పెట్టడం లేదు. విజువల్స్, స్కేల్, స్టైల్ – అన్నీ హాలీవుడ్ రేంజ్ లో.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్‌కి ఒక్కటే టెన్షన్ – అనిరుధ్ రవిచందర్.
అనిరుధ్ ఇప్పటికే పలు పెద్ద సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసినా, ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM), రీ-రికార్డింగ్ పనులు పూర్తి కాలేదు. యాక్షన్, ఎమోషన్ మిక్స్ అయిన చిత్రాలకు BGM చాలా కీలకం. కింగ్‌డమ్ వంటి భారీ యాక్షన్ ఫిల్మ్‌కు అనిరుధ్ స్కోర్ లేకపోతే మేజిక్ మిస్ అవుతుంది.
విజయ్ దేవరకొండకు ఇది చాలా ముఖ్యమైన సినిమా. “లైగర్”, “ఖుషి”, ప్యామిలీ మెన్ వంటి సినిమాల తర్వాత వస్తున్న ఈ చిత్రం రిజల్ట్ సరిగ్ా ఇవ్వకపోతే, మాస్ ఆడియెన్స్‌లో ఆయన క్రేజ్‌పై ప్రశ్నలు మొదలవుతాయి.
అంతేకాదు, ఇప్పటికే సమ్మర్ సెలవులు, ఐపీఎల్ పూర్తవ్వటం వంటి ప్లస్ పాయింట్స్ ఈ సినిమాకు కలిసొస్తున్నాయి. అనిరుధ్ తన వర్క్ టైమ్‌లో పూర్తి చేస్తే… మెగా రిలీజ్ కు అడ్డంకులు ఉండవు. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తోంది.