విజయ్ దేవరకొండ తాజా పాన్ ఇండియా సినిమా తెలుగులో ‘కింగ్‌డమ్’ అనే శక్తివంతమైన టైటిల్‌తో వస్తోంది. అదే పేరుతో అన్ని భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ మొదట ప్లాన్ చేశారు. కానీ హిందీలో మాత్రం ఊహించని అడ్డంకి వచ్చేసింది!
అక్కడ ఇప్పటికే ‘కింగ్‌డమ్’ అనే టైటిల్ రిజిస్టర్ అయిపోయింది. బాలీవుడ్‌లో టైటిల్ రిజిస్ట్రేషన్ రూల్స్ చాలా కఠినంగా ఉండటంతో, దాన్ని మార్చాల్సి వచ్చింది. అప్పుడు తీసుకున్న నిర్ణయం – హిందీ వెర్షన్‌కు ‘సామ్రాజ్య’ అనే కొత్త పేరు.
ఈ టైటిల్ కూడా మౌలికంగా అదే అర్ధాన్ని కలిగి ఉండడం విశేషం. కానీ పాన్ ఇండియా సినిమాల్లో ఒకే టైటిల్‌తో విభిన్న భాషల్లో రిలీజ్ అవ్వడం ఎంత ప్రాధాన్యత కలిగి ఉందో ఈ మార్పు మరోసారి గుర్తు చేసింది.
VIJAY DEVERAKONDA'S NEXT PAN-INDIA FILM IS 'KINGDOM' – HINDI VERSION TITLED 'SAAMRAJYA' – 31 JULY 2025 RELEASE… #VijayDeverakonda returns to the big screen with #Kingdom, slated for a worldwide theatrical release on 31 July 2025… The #Hindi version is titled #Saamrajya.
— taran adarsh (@taran_adarsh) July 19, 2025
The… pic.twitter.com/Xfa9mW8ZJ5
జూలై 31న ఈ యాక్షన్ డ్రామా అన్ని భాషల్లో విడుదల కానుండగా, నార్త్ బెల్ట్‌లో ‘సామ్రాజ్య’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ దేవరకొండకు ‘లైగర్’ తర్వాత బాలీవుడ్‌లో రీ ఎంట్రీ కావడం కూడా స్పెషల్ హైప్ క్రియేట్ చేస్తోంది.
కింగ్‌డమ్ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నది. సత్యదేవ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్ర మ్యూజిక్ అందిస్తున్నాడు.