‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఈ సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి రాబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అడుగుపెడుతూండటంతో తెలుగులోనూ క్రేజ్ క్రియేట్ అయ్యింది. రీసెంట్ గా విడుదలైన టీజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్ లుక్‌పై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి.

ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్న అనైతా ష్రాఫ్ అదాజానియా—బాలీవుడ్ టాప్ స్టైలిస్ట్—తనదైన శైలిలో ఎన్టీఆర్‌కు మేకోవర్ ఇచ్చింది. “ఎన్టీఆర్ ఎక్కడున్నా ఆ చుట్టూ ఎనర్జీ పుట్టిస్తుంది. ఆయన లుక్ డిజైన్ చేసే సమయంలో నాకు ఓ స్పష్టమైన దిశ అనిపించింది. అతని పాత్రలో ఒక రా నెస్ ఉంది. హ్యూమన్ మిషన్‌లా కనిపించేలా తీర్చిదిద్దాం. అతని క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్‌గా సూటయ్యేలా రగ్గడ్ జాకెట్లు, లెదర్ కాస్ట్యూమ్స్, పవర్‌ఫుల్ సూట్లు ఉపయోగించాం,” అని చెప్పింది అనైతా.

పైగా అందులో ఒక సాంగ్ ను హృతిక్ రోషన్ – కియరాపై తీశారు. కియరా బికినీలో కనిపిస్తోందట. ఇక రెండో పాటను హృతిక్-ఎన్టీఆర్ పై షూట్ చేయనున్నారు. వచ్చే నెల హృతిక్-తారక్ పై ఈ సాంగ్ ను 7 రోజుల పాటు షూట్ చేస్తారట, ఈ సాంగ్ లో తారక్ స్టెప్స్ అదిరిపోతాయని తెలుస్తోంది. కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

, , ,
You may also like
Latest Posts from