ఎన్టీఆర్ (NTR) హీరో గా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రెడీ అవుతున్న ఈ చిత్రం కొత్త రిలీజ్ డేట్ ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మంగళవారం ప్రకటించింది. 2026 జూన్25న ‘ఎన్టీఆర్-నీల్’ మూవీని విడుదల చేయనున్నట్లు తెలిపింది.
‘‘ఇద్దరు డైనమిక్ వ్యక్తుల కాంబినేషన్లో బాక్సాఫీస్ విధ్వంసమయ్యే అనుభూతికి సిద్ధకండి. 25 జూన్ 2026న థియేటర్లు దద్దరిల్లే సౌండ్స్ మీరు వింటారు. మాస్లకే మాస్ అయిన ఎన్టీఆర్ పుట్టినరోజున ప్రత్యేక గ్లింప్స్తో వస్తాం’’ -మైత్రీ మూవీ మేకర్స్
మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర టీమ్ ప్రకటించింది. అయితే, కథకు ఉన్న డిమాండ్ దృష్ట్యా షూటింగ్ కు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు సైతం ఆలస్యమయ్యేలా కనిపిస్తుండటంతో కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
A Massacre by the dynamic duo delivers a notice for a havoc-filled experience 🔥
— Mythri Movie Makers (@MythriOfficial) April 29, 2025
𝟮𝟱 𝗝𝗨𝗡𝗘 𝟮𝟬𝟮𝟲.
You’ll hear the loudest chants! #NTRNeel 💥
A Special glimpse for the Man of Masses @tarak9999 ’s birthday.#PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm… pic.twitter.com/qAIgWa6mZM
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో వేగంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ ఇప్పటికే సెట్స్ లో అడుగు పెట్టగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ సీక్వెన్స్లను తెరకెక్కిస్తున్నారని సమాచారం.
ఈ సినిమాలో డార్క్ బ్యాక్డ్రాప్ ఉండబోతోందని, తారక్ క్యారెక్టర్ మాస్, ఇంటెన్స్ అవతారాన్ని చూపించబోతోందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ సరసన ఇందులో రుక్మిణీ వసంత్ (Rukmini vasanth)నటిస్తున్నారని, దీనికి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉందని ప్రచారం సాగుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు. బరువు తగ్గి బాగా నాజూగ్గా కనిపిస్తున్నారు. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్… ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కలిసి చేస్తున్న చిత్రమిది.