ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది… కోవిడ్ తర్వాత ఆడియన్స్ మాస్‌గా థియేటర్‌లకు వెళ్లడం తగ్గించి, ఎక్కువగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పైనే ఆధారపడుతూండటంతో సమస్య మొదలైంది. దాంతోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ – ముఖ్యంగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ లాంటి డిజిటల్ జెయింట్స్ – తెలుగు సహా ప్రాంతీయ సినిమాల నిర్మాణంలోనూ మెల్లగా తోసుకుంటూ వచ్చేస్తున్నాయి.

ఓటిటి సంస్దలు …ఇన్నాళ్లూ ‘డిజిటల్ హక్కుల’ కోసం నిర్మాతల వద్దకు వచ్చేవారు, ఇప్పుడు సినిమా మొదలుపెట్టేముందే స్క్రిప్ట్ మాకు చూపించండి అంటూ డిమాండ్ చేస్తున్నారు! ఇది ఓటిటి ల నుంచి కొత్త డిమాండ్. నిర్మాతలకు షాకిచ్చే డిమాండ్.

ఒకప్పుడు నిర్మాతలు ఓటీటీ డీల్స్‌తో కొత్త సినిమాలు మొదలుపెట్టేవారు… ఇప్పుడు అదే ఓటీటీ వాళ్లు నిర్మాతల చేతిలో పట్టు బిగించేస్తున్నారు. కథ ఓకే అయితేనే డీల్, మార్పులు చెప్పి తప్పనిసరిగా ఫాలో అవ్వాలి అంటున్నారు.

ఇది ఓటిటీల విజయం కాదు… దర్శకుల సృజనశక్తికి బిగిన గొళ్లం!

ఇంతవరకూ ‘ఫినిష్‌డ్ ఫిల్మ్’ చూసిన తర్వాతే రైట్స్ తీసుకునే ఓటీటీ సంస్థలు… ఇప్పుడు కథా నిర్మాణం సమయం నుండే కలిసిపోతున్నాయి. bound script, screenplay structure, characters arc… ఇవన్నీ వాళ్ల నిబంధనలకు లోబడే ఉండాలి.

ఇక ఓటీటీ ఓపెన్ డోర్ కాదు – ఇప్పుడు అదే గేట్ కీపర్!

ఇదంతా చూస్తుంటే – సినిమా స్క్రిప్ట్ సత్తా కాదు, స్క్రిప్ట్ ఒప్పించగలిగే డాక్యుమెంట్ సత్తా కావాలి అన్నట్టుంది. మెల్లగా క్రియేటివిటీ మీద కంట్రోల్ తీసుకుంటూ… ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఇప్పుడు పర్ఫెక్ట్‌ గేమ్ ఆడుతున్నాయి.

ఈ పరిణామం దిశ ఏంటో,ఎటు వెళ్తుందో చెప్పడం కష్టం. కానీ ఒక్క విషయం స్పష్టం – ఓటీటీలు మద్దతుతో చాలా మంది దర్శకులు & నిర్మాతలు క్లయింట్‌ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లా మారే రోజు అతి  దగ్గర్లో ఉంది.

, , , , ,
You may also like
Latest Posts from