జూలైలో థియేటర్లకు వచ్చిన హరి హర వీర మల్లుడు: పార్ట్ 1 — స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్, మొదటి రోజు హడావుడి తప్ప… ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద సైలెంట్ ఫిల్మ్ లా మారిపోయిన సంగతి తెలసిందే. పవర్ స్టార్ సినిమాకు తగిన స్థాయి రాబడులు రాకపోవడం అభిమానులను షాక్‌లోకి నెట్టింది.

తెలుగురాష్ట్రాల్లో ఓపెనింగ్ డే మాత్రం డీసెంట్‌గా ఉన్నా, ఓవర్సీస్‌లో మాత్రం ఊహించని దెబ్బ తగిలింది. ప్రీ-బుకింగ్స్ నుంచి క్లోజింగ్ వరకూ… ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు.

ముఖ్యంగా నార్త్ అమెరికాలో పరిస్థితి మరీ దారుణం. మొత్తం ఓవర్సీస్ కలెక్షన్ $1.65 మిలియన్ వద్ద ఆగిపోవడం, అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న హీరో సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాలు నోరెళ్ళబెట్టేలా అయింది.

ఒకప్పుడు “ఫ్లాప్” అంటే ఒక్క రెండు ఏరియాల్లో మాత్రమే అనేవారు… కానీ హరి హర వీర మల్లు విషయంలో “కలాసల్ డిజాస్టర్” అన్న ట్యాగ్ అన్ని ఏరియాల్లో సరిపోయింది. అంతే కాదు — ఈ బడా బడ్జెట్ ప్రాజెక్ట్ ఓవర్సీస్‌లో రికార్డ్ బ్రేక్ చేస్తుందనుకున్న వారు, ఇప్పుడు “రెవెన్యూ” విషయంలో కాకుండా “నష్టాల్లో” లో రికార్డులు లెక్కిస్తున్న పరిస్థితి!

, , , , ,
You may also like
Latest Posts from