పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఇది కేవలం సినిమా కాదు… ప్రతి అభిమానికి ఇది ఓ కల, ఓ చరిత్ర, ఓ వేచి చూపు. ఎన్నో ఒడిదొడుకులు, వాయిదాలు, రాజకీయ షెడ్యూళ్ల మధ్య చివరికి ‘హరి హర వీర మల్లు’ షూటింగ్ పూర్తి అయ్యింది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే – రిలీజ్ ఎప్పుడెప్పుడు?

మే 30 లేదా జూన్ మధ్య…?

ప్రస్తుతం ఇండస్ట్రీలో వేడెక్కిస్తున్న చర్చ ఇదే. మే 30న సినిమా రిలీజ్ కావచ్చనే వార్తలు సోషల్ మీడియాలో ట్రెండవుతున్నాయి. కానీ స్పష్టత మాత్రం రాలేదు. సమాచారం ప్రకారం, అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా విడుదల తుది తారీఖును డిసైడ్ చేయనుంది. నిర్మాత ఏఎం రత్నం ప్రస్తుతం ముంబైలో డిజిటల్ డీల్ ఖరారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇంతలో మరో ట్విస్ట్ – ‘కింగ్‌డమ్’ కూడా అదే రోజున?

విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ సినిమా కూడా మే 30న విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆ సినిమాకు ప్రమోషన్స్ జోష్‌లో కొనసాగుతున్నాయి. కానీ ఇందులో చిన్న క్లాస్ స్టోరి ఉంది – ‘కింగ్‌డమ్’ నిర్మాత ఎస్. నాగవంశీకి పవన్ కళ్యాణ్‌తో మంచి వ్యక్తిగత అనుబంధం ఉంది. అందుకే, ఒకే రోజున రెండు పెద్ద సినిమాలు క్లాష్ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరు వెనక్కి తగ్గుతారు అన్నది ఆసక్తికరం.

అంతిమంగా – తేదీపై స్పష్టత రానుంది!

‘హరి హర వీర మల్లు’ చిత్రాన్ని ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా, సంగీతం అందించినది ఎం.ఎం.కీరవాణి. భారీ స్థాయిలో రూపొందిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. చిత్రబృందం ఈ శుక్రవారంన విడుదల తేదీపై అధికారిక ప్రకటన చేయనుంది.

, , ,
You may also like
Latest Posts from