పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు NRI నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌తో ఎంతో సన్నిహిత సంబంధం ఉన్న సంగతి తెలసిందే. సినిమాలతో పాటు జనసేన పార్టీలోనూ ఆయన కీలకంగా ఉంటూ వస్తున్నారు. పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించగా, ఇటీవల విడుదలైన హరి హర వీర మల్లు చిత్రానికి సంబంధించిన ఆర్థిక సమస్యలు కూడా ఆయనే పరిష్కరించి, దాదాపు రూ.35 కోట్లు క్లియర్ చేసి సినిమాకు సాఫీగా థియేట్రికల్ రిలీజ్‌ సాధ్యమయ్యేలా చేశారు.

ఇప్పుడు పవన్ కల్యాణ్‌ కృతజ్ఞతగా టీజీ విశ్వ ప్రసాద్‌కు ఓ సినిమా చేయాలనుకుంటున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. దర్శకుడు ఎవరు? కథ ఏమిటన్న విషయాల్లో ఇంకా స్పష్టత లేదు. అయితే ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కనుంది.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఓజీ షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఆయన పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. ఈ ఏడాదిలో పవన్ నుంచి కొత్త సినిమాలు ఉండే అవకాశం లేదు. కానీ వచ్చే ఏడాదిలో పరిస్థితులు మారే సూచనలు ఉన్నాయి. టీజీ విశ్వ ప్రసాద్ ఇప్పటికే పవన్‌కు సరిపోయే దర్శకుడి కోసం విస్తృతంగా అన్వేషణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు త్వరలోనే రాబోతున్నాయి.

, ,
You may also like
Latest Posts from