
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతల్లో బిజీగా ఉన్నా — తన సినిమా ప్రాజెక్టులను పూర్తి చేయడంలో మాత్రం ఎలాంటి రాజీ పడటం లేదు. ఇప్పటికే ఆయన నటించిన ‘హరి హర వీర మల్లు’, ‘OG’ థియేటర్లలో విడుదలయ్యాయి. ముఖ్యంగా ‘OG’ ఈ ఏడాది బాక్సాఫీస్‌లో అగ్రస్థానంలో నిలిచి, పవన్ ఫ్యాన్స్‌కు పండుగలా మారింది. ఈ క్రమంలో ఆయన నెక్ట్స్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పైనే అందరి దృష్టీ ఉంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్, హరీశ్ కాంబినేషన్‌లో వస్తుండటంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
“ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది” అంటూ ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.ఇప్పటికే ఆయన తన భాగం షూటింగ్‌ను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం పూర్తి చేశారు. కానీ దర్శకుడు హరీష్ శంకర్‌కి ఇంకా ఇతర ఆర్టిస్టుల సీన్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలి ఉన్నాయి.
తాజా బజ్ ఏమిటంటే — మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను విడుదల చేయడానికి రెండు టైమ్ స్లాట్లను పరిశీలిస్తున్నారు. వాటిలో ప్రధానంగా ఒకటి మహాశివరాత్రి సీజన్ — ఫిబ్రవరి 12, 2026! ఆ డేట్ చుట్టూ రిలీజ్ చేసే ఆలోచనలో టీమ్ ఉందట.
ఇక రెండో ఆప్షన్ ఏప్రిల్. ఎందుకంటే రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మార్చి 27, 2026న థియేటర్లలోకి వస్తోంది. దాంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను దానికి ముందు లేదా రెండు వారాల తర్వాత రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని టాక్. కానీ అన్ని పనులు సకాలంలో పూర్తయితే, పవన్ ఫ్యాన్స్ కోసం మహాశివరాత్రి 2026కే భగత్ సింగ్ గర్జన వినిపించే ఛాన్స్ బలంగానే ఉంది.
తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే — ఈ సినిమా తమిళ హిట్ ‘థెరి’ నుండి ప్రేరణ పొందినప్పటికీ, హరీష్ శంకర్ దానిని పూర్తిగా తెలుగు నేటివిటీకి తగినట్లు మలచాడట. శ్రీలీల, రాశీఖన్నా హీరోతో జోడీగా కనిపించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, పవన్ మాస్ లుక్‌పై ఫ్యాన్స్‌కి ఇప్పటికే హైప్ ఎక్కేసింది.
పవన్ “భగత్ సింగ్”గా తిరిగి స్క్రీన్‌పై గర్జించేది మహాశివరాత్రి రోజేనా? ఇదే పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కి కొత్త పండుగ అవుతుందా?
