పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అభిమానుల్లో ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేని స్థాయిలో ఉంది. రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ, పవన్ తన సినిమాలపై కూడా పూర్తి ఫోకస్ చూపిస్తున్నారని ఈ ప్రాజెక్ట్ స్పష్టంగా తెలియజేస్తోంది.
ఇప్పటికే “హరిహర వీరమల్లు” జూలై చివరిలో విడుదల కానుండగా, ఆ తరువాత మోస్ట్ అవైటెడ్ మూవీ “OG” రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ హవా టాలీవుడ్‌లోను, రాజకీయాల్లోను రెగ్యులర్ న్యూస్ గా మారిపోతున్నది.
ఇక ప్రస్తుతం “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ తన పార్ట్‌ను ఆగస్టు చివరినాటికి పూర్తి చేయనున్నారని సమాచారం. ఈ క్రమంలో, సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ ట్రీట్ కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ మాస్‌ఫుల్ టీజర్‌ను రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ టాక్.
ఇదే సమయంలో, గతంలో ఎన్నికల ముందు రిలీజ్ చేసిన డైలాగ్ టీజర్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ అలాంటి పవర్‌ఫుల్ డైలాగ్‌తో కూడిన టీజర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రం ద్వారా హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కలయిక మళ్లీ రిపీట్ అవుతోంది. గతంలో “గబ్బర్ సింగ్” తో వీరిద్దరూ బ్లాక్‌బస్టర్ అందించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే స్థాయిలో మాస్ ఫెస్టివల్‌కు రెడీ అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఫ్యాన్స్ మాత్రం ఈ బర్త్‌డే టీజర్ కోసం వెయిటింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయారు!