పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీర మళ్ళు ఫస్ట్ వీకెండ్ ల్లోనే ఊహించని విధంగా ఫెయిల్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, తొలి వీకెండ్‌లో వరల్డ్‌వైడ్‌గా ₹103 కోట్లు గ్రాస్, ₹63 కోట్లు షేర్ (GST సహా) మాత్రమే రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే రికవరీ రేటు కేవలం 52 శాతమే. దీంతో సినిమాను “డిజాస్టర్” అనే ముద్ర వేసేశారు.
ఇంకేముంది, రిలీజ్ ముందు నుంచే డెఫిసిట్‌లో ఉన్న నిర్మాతలు, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల నష్టాన్ని కూడా భరించాల్సిన పరిస్థితిలోకి వచ్చేశారు. ఆదివారం ముగిసేలోపే ఫుల్‌రన్ అన్న పరిస్దితి కనబడింది. అయితే అసలు షాక్ ఏంటంటే, సోమవారం నుండి సినిమాకు థియేటర్లలో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. కొన్ని థియేటర్లలో షేర్ ఒక్క కోటికంటే తక్కువగా నమోదైంది!
రూ.300 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా థియేట్రికల్ షేర్ కేవలం దాని 20 శాతం మాత్రమే. ఇలాంటి రిజల్ట్‌తో మేకర్స్‌కు తీవ్రంగా నష్టాలు వచ్చాయి. ఓవర్‌ఫ్లో లాభాల మీదే ఆధారపడ్డ బిజినెస్‌లో, మొదటి వారంలోనే సినిమాకు రన్ ముగిసినట్టే!
హిస్టారికల్ నేపథ్యాన్ని, పవన్ కళ్యాణ్ పోరాట స్ఫూర్తిని రంగులెక్కించిన ఈ చిత్రానికి ఇటువంటి ఫలితం ఎదురవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.