ప‌వ‌ర్ స్టార్‌ పవన్ క‌ల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతోకాలంగా ఆత్రుత‌గా ఎదురుచూసిన సినిమా ‘హరిహర వీరమల్లు’ నిన్న‌ విడుద‌లైన విష‌యం తెలిసిందే. హరి హర వీరమల్లు ఇది ఫిక్షనల్ స్టోరీ. చరిత్రతో ఏ మాత్రం సంబంధం లేని కల్పిత పాత్రతో అల్లిన ఊహాతీతమైన కథ. అధర్మంపై పోరాడే ఓ యోధుడి కథ.

హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలన్న ఔరంగజేబుపై వీరమల్లు చేసిన యుద్ధమే హరిహర వీరమల్లు కథ. కృష్ణానదీ తీరంలో దొరికిన విలువైన కోహినూర్ వజ్రం ముహమ్మద్ కులీ కుతుబ్ షాల దగ్గర నుంచి మొఘలుల వద్దకు ఎలా చేరిందనే విషయాన్ని అంతర్లీనంగా స్పృశిస్తూ.. మొఘల్ పాలకుడు ఔరంగజేబు నిరంకుశత్వాన్ని, అతని దురాగతాలను కళ్లకి కట్టిన చిత్రం వీరమల్లు. ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే..

పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్-డే కలెక్షన్లతో ‘హరి హర వీర మల్లు’ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. జూలై 23వ తేదీ రాత్రి ప్రీమియర్స్ నుంచే కలెక్షన్ల సునామీ మొదలైంది. ఆంధ్ర, నిజాం, ఓవర్సీస్ ప్రీమియర్స్ కలిపి Day 1కి ₹46.55 కోట్ల షేర్ (GST కలుపుకుని) వసూలైంది. వరల్డ్‌వైడ్ గ్రాస్ అయితే సుమారుగా ₹70 కోట్లు చేరింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ₹120 కోట్లు !

డిస్ట్రిబ్యూటర్ పరంగా చూస్తే ఇది బలమైన ఓపెనింగ్. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ₹120 కోట్లు కాగా, ఇప్పటికే దాని ఒక మూడవ వంతు రికవరీ అయ్యింది. అయితే హెవీ బడ్జెట్ దృష్ట్యా ప్రొడ్యూసర్ ఎక్స్‌పెక్టేషన్ మాత్రం ₹100 కోట్ల గ్రాస్ ఉండాల్సిందే అనే టాక్ ఉంది.
వీటి మధ్య ఓవర్సీస్ మార్కెట్ మాత్రం నిరాశపరిచింది — అక్కడ పూర్తిగా డిజాస్టర్ అనిపించింది.

ఏరియా వారీగా Day 1 కలెక్షన్లు (తెలుగు వెర్షన్)

ప్రాంతం షేర్ గ్రాస్

నిజాం ₹12 కోట్లు —
సీడెడ్ ₹5.7 కోట్లు —
ఉత్తరాంధ్ర ₹5 కోట్లు —
గుంటూరు ₹4.15 కోట్లు —
తూర్పు గోదావరి ₹3 కోట్లు —
పశ్చిమ గోదావరి ₹3.1 కోట్లు —
కృష్ణా ₹1.3 కోట్లు —
నెల్లూరు ₹2.75 కోట్లు —
AP/TS మొత్తం ₹39.05 కోట్లు —
రెస్టాఫ్ ఇండియా (అంచనా) ₹4.75 కోట్లు —
ఓవర్సీస్ ₹2.75 కోట్లు —

మొత్తం Day 1 తెలుగు షేర్: ₹46.55 కోట్లు
వరల్డ్‌వైడ్ గ్రాస్: సుమారు ₹70 కోట్లు

పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ఈ ఓపెనింగ్ క్లారిటీగా చూపిస్తోంది. కానీ, ఇక నుంచి సినిమా కంటెంట్ మీదే ఫలితాలు ఆధారపడనున్నాయి. రాబోయే రోజుల్లో ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!

, , , , , ,
You may also like
Latest Posts from