
ఐటమ్ సాంగ్ లో పదాలు మార్చిన పవన్ కళ్యాణ్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా రాబోతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). నిధి అగర్వాల్ హీరోయిన్. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఇందులోని ‘అసుర హననం’ పాటను ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దర్శక, నిర్మాతలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఈ ఈవెంట్‌లో చిత్ర సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశారు.
కీరవాణి పేర్కొన్నదానిప్రకారం — సినిమాలో ఉన్న ఐటమ్ సాంగ్ ‘తార తార’ లోని కొన్ని పదాలు మహిళలను అవమానించేలా ఉన్నాయని పవన్ కళ్యాణ్ స్వయంగా సూచించడంతో, ఆ పాటలోని లిరిక్స్‌ను వెంటనే మార్చినట్టు ఆయన తెలిపారు.
పవన్ కళ్యాణ్ చూపిన బాధ్యతాయుతమైన దృష్టిని, అతని సామాజిక నైతికతను కీరవాణి ప్రశంసిస్తూ — “ఇలాంటి కథనాల్లోనూ పవన్ ఒక హీరోగా నిలుస్తున్నాడు,” అంటూ కొనియాడారు.
హరిహర వీరమల్లు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. జూన్ 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ డేయోల్ ప్రధాన విలన్ గా కనిపించనున్నాడు.
ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించగా, దర్శకత్వ బాధ్యతలు కృష్ణ మరియు ఏఎం జ్యోతికృష్ణ పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం పవన్ అభిమానులకే కాక, సమాజానికీ ఓ శక్తివంతమైన సందేశం అందించనుంది.
