సెట్ మీద కెమెరా మళ్లీ రోలవుతోంది. పవన్ కల్యాణ్ “ఓజీ” షూటింగ్‌కు రీ ఎంట్రీ ఇచ్చేశాడు. కానీ అసలు ప్రశ్న ఇదే – ఇంకా ఎన్ని రోజులు బ్యాలెన్స్ ఉంది? షూటింగ్ పూర్తవడానికి ఎంత టైం పడుతుంది?
ఇండస్ట్రీలో వినిపిస్తున్నది ఏంటంటే… ఓవరాల్‌గా 30 రోజులు డేట్స్ ఇచ్చారట పవన్. అవి కంటిన్యూగా వస్తే, సినిమా పూర్తి అవ్వడం కన్‌ఫార్మ్. కానీ పవన్‌కి పొలిటికల్ కమిట్మెంట్స్ ఉన్నా… ఈసారి సినిమా మీదనే ఫోకస్ పెడతారట.
ప్రస్తుతం హైదరాబాద్‌లో షెడ్యూల్ జరుగుతోంది. తర్వాత విజయవాడ, ముంబయిల్లో కొన్ని కీలక సీన్లు తెరకెక్కించనున్నారు. ‘‘మళ్లీ మొదలైంది… ఈసారి పూర్తిగా ముగిద్దాం!’’ అంటూ మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.
సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మల్టీలాంగ్వేజ్ మూవీలో పవన్ మునుపెన్నడూ చూడని మాస్ యాంగ్రీ అవతారంలో దర్శించనున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. సంగీతాన్ని తమన్ అందిస్తుండగా… విజయవాడ, ముంబయిల్లో తదుపరి షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పుడున్న పొలిటికల్ ప్రశాంత వాతావరణం పవన్‌కు ప్లస్ అయ్యింది. అందుకే ఆయన ఫుల్ ఫోకస్ సినిమాల మీదే. ఒకవేళ ఈ 30 రోజుల కాల్షీట్లు బ్యాలెన్స్ షూట్‌కి సరిపోతే… ‘ఓజీ’ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టార్ట్ అవుతుంది. ఈ రెండు సినిమాలు 2025లోనే కంప్లీట్ చేయాలన్నదే పవన్ టార్గెట్.
పవన్ ఏం చేస్తున్నాడో స్పష్టంగా అర్థమవుతుంది – ఒక్కసారి సినిమాల్ని పూర్తి చేస్తే, తరువాత రాజకీయాలపై 100% దృష్టి పెట్టబోతున్నాడు. ఇది కేవలం ఫ్యాన్స్ కోసమే కాదు… సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న నిర్మాతల బాధ్యతను తీసుకున్న పవన్ మూడ్ ఇది.
మొత్తానికి… ‘‘ఓజీ’’ సెట్లో మళ్లీ స్టార్ట్ అయినా సరే… అసలు క్లైమాక్స్ 30 రోజుల తర్వాతే!