బాక్సాఫీస్ వద్ద పూర్తి స్థాయిలో డిజాస్టర్‌గా మిగిలిపోయిన హరి హర వీరమల్లు ఇప్పుడు మరో రంగంలో యుద్ధం మొదలెట్టింది. కమర్షియల్‌గా విఫలమైనా, ఈ చిత్రం ఓ సామాజిక ఉద్యమం లా మారిపోతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్‌కు సిద్ధమవుతోంది.
హిస్టారికల్ ఫిక్షన్ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా, ఔరంగజేబ్ పాలనలో సంభవించిన ఘోరాలపై స్పష్టంగా ప్రశ్నించింది. సనాతన ధర్మం స్ఫూర్తిని ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. సినిమా విడుదలై దాదాపు వారం రోజులు గడిచినా, ఈసారి మళ్లీ వార్తల్లోకి వచ్చిందంటే కారణం ప్రత్యేకమే.
ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో, విద్యార్థుల కోసం ఈ సినిమాను స్క్రీన్ చేయాలని ఓ ట్రస్ట్ ముందుకొచ్చింది. ఇది కేవలం సినిమా చూపించడం మాత్రమే కాదు… చరిత్రను తిరిగి గుర్తుచేయడం, మన సంస్కృతిపై గర్వాన్ని నూర్పించడం, ప్రశ్నించాల్సిన వాస్తవాలపై విద్యార్థుల దృష్టిని తీసుకెళ్లే ప్రయత్నం.
ఇక బాక్సాఫీస్ పరంగా చెప్పాలంటే… మొదటి వారం ఆశించిన స్థాయిలో కాకపోయినా, రెండో వీకెండ్లో కొంత కలెక్షన్స్ రాబట్టినట్టు ట్రేడ్ టాక్. అయితే వసూళ్లు ఎలా ఉన్నా… హరి హర వీరమల్లు ఇంకో దారిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది – సినిమా వేదికగా, చరిత్ర పునశ్చరణగా!