ఇప్పుడంటే కాస్త క్రేజ్ తగ్గింది కానీ పూజా హెగ్డేకు తెలుగులో ఓ రేంజి డిమాండ్ ఉంది. ఇప్పుడు కూడా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ పాన్‌ ఇండియా హీరోయిన్ గా రాణిస్తున్నారు. అయితే తన ప్రతి విజయం వెనుక కఠిన శ్రమ ఉంటుందని, అదేవిధంగా ఎన్నో అవమానాలు, బాధలు, మనస్థాపం వంటి చేదు అనుభవాలు ఉంటాయని చెప్తోంది.

పూజా హెగ్డే తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఇటీవల ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చింది. తన గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా ట్రోలింగ్స్‌ చేశారన్నారు. అవి తన కుటుంబాన్ని చాలా బాధించాయని ఆవేదనను వ్యక్తం చేశారు.

అలాగే నటిగా తన ఎదుగుదలను ఓర్వలేక దెబ్బ కొట్టాలని కొందరు కోట్ల రూపాయలు ఇచ్చి ట్రోలింగ్స్‌ చేయించారని అర్ధం అయ్యిందన్నారు. అయితే, తనపై వచ్చిన ట్రోలింగ్ చూసి తల్లిదండ్రులు బాధపడినట్లు ఆమె చెప్పారు.

ఆ ట్రోలింగ్‌ ఆపేయాలన్నా డబ్బు చెల్లించాలని తనను కొందరు కోరారని ఆమె తెలిపారు. అయితే, తానెవరికీ ఎలాంటి చెడు చేయలేదని, అయినా తనపై ఎందుకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదన్నారు.

అయితే కొంత కాలం తర్వాత అలాంటి ట్రోలింగ్స్‌ను పట్టించుకోవడం వదిలేశానని పూజా హెగ్డే చెప్పారు. అయితే ఇంతకీ కోట్లు ఖర్చు పెట్టి మరీ పూజపై ట్రోలింగ్ చేస్తున్నది ఎవరు తోటి హీరోయిన్లా లేక హీరోలా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం నటుడు సూర్య సరసన నటించిన రెట్రో చిత్రం మే 1వ తేదీన తెరపైకి రానుంది. కాగా తాజాగా విజయ్‌కి జంటగా మరోసారి జననాయకన్‌ చిత్రంలో నటిస్తున్నారు. నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్‌కు జంటగా కాంచన 4 లో నటిస్తున్నారు.

You may also like
Latest Posts from