పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వరస సినిమాలు రెడీ అవుతున్నాయి. రీసెంట్ గా ది రాజా సాబ్ (మారుతి డైరెక్షన్‌లో) షూట్ చేస్తున్నారు. మరో ప్రక్క Fauji (హను రాఘవపూడి) కూడా రెడీ అవుతోంది, ‘సీతారామం’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం కావంటో ‘ఫౌజీ’ పై మంచి అంచనాలే ఉన్నాయి. పీరియడ్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడని టాక్. తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాకోసం భారీ బడ్జెట్, 180 వర్కింగ్ డేస్ కేటాయించారు. Massive sets, VFX కి ఖర్చులు భారీగానే ఉండనున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ ప్రస్తుతం నెగోషియేషన్ లో ప్రభాస్ కు రెమ్యునరేషన్ గా డిజిటల్ రైట్స్ గా ఇవ్వబోతున్నారు. అంటే? రిపోర్ట్స్ ప్రకారం, 150-180 కోట్లు ప్రభాస్’ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది!
పీరియాడికల్ వార్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ బ్రిటీష్ ఆర్మీ సైనికుడిగా కనిపించనున్నాడని టాక్. పాన్ ఇండియా మూవీగా నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద వంటి సీనియర్లు నటిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తోంది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఈ కథ . ధైర్యం, ప్రేమ, త్యాగం వంటి ఇతివృత్తాల చుట్టూ సాగుతుందని సమాచారం.