సోషల్‌ మీడియా లో ముఖ్యంగా ట్విట్టర్ లో ప్రతి సినిమా రీలీజ్‌ అయిన వెంటనే విశ్లేషణ, పోలికలు, ఫ్యాన్ రియాక్షన్స్ షేర్ అవుతూంటాయి. హిట్ అయితే ఎందుకు హిట్టైందో, ప్లాఫ్ అయితే ఎలా ఫెయిల్ అయ్యిందో చూస్తూ పోలుస్తూ చెప్తూంటారు. ఈ ట్రెండ్ ఇప్పుడు NTR వార్ 2 ని సైతం వదలలేదు.

వార్ 2 తర్వాత, ఎన్టీఆర్ అభిమానులు ఎమోషన్స్ షాక్‌లో ఉన్నాయి. NTR ఎలా చూపించారో, అతని స్టార్ పవర్ వాడుక ఎలా జరిగిందో,ఎక్కడ తేడా జరిగిందో డిస్కస్ చేస్తున్నారు. అంతేకాదు మన హీరోల హిందీలో చేసిన డిజాస్టర్ ఫిల్మ్స్ ఆదిపురుష్ , జంజీర్ లా పోలుస్తున్నారు.

వార్ 2 చివరికి NTR ఎలా చూపించారో చూసి తెలుగు ప్రేక్షకుల ఎమోషన్స్ సూపర్ డిస్పాయింట్ అయ్యాయి. కానీ ఇదే కొత్త ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక హీట్ డిబేట్ మొదలెట్టేలా చేసింది – సౌత్ డైరెక్టర్లు బాలీవుడ్ స్టార్‌లతో బ్లాక్‌బస్టర్‌లు క్రియేట్ చేస్తుంటే, బాలీవుడ్ డైరెక్టర్లు తెలుగు హీరోలతో కేవలం ఫ్లాప్స్ మాత్రమే ఇస్తున్నారు! ఇది రిపీటింగ్‌గా జరుగుతోంది.

రామ్ చరణ్ గూడా ఇదే ఫలితం చూసాడు. మగధీరా టైమ్‌లో, హిట్ బాలీవుడ్ మూవీ Zanjeer రీమేక్‌లో Apoorva Lakhia తో జతకట్టిన చరణ్, “ఎంగ్రీ యంగ్ పోలీస్ ఆఫీసర్” గా కనిపించారు. అమితాబ్‌ సూపర్ హిట్ ఫిల్మ్, చరణ్‌కి కేవలం ట్రోల్ కరెన్సీగా మారింది. Apoorva ఆయన క్రేజ్‌ని సరిగా యుటిలైజ్ చేయలేకపోయాడు.

తర్వాత, ఇటీవల Adipurush… రామాయణం కొత్త వెర్షన్, సక్సెస్‌ఫుల్ Tanaji డైరెక్టర్ Om Raut చేసినది, కానీ ప్రేక్షకులు ఆశించిన ఫీల్ మిస్ అయ్యింది. ప్రబాస్ పాన్-ఇండియా స్టార్ అయినా, Om Raut ఆయన స్టార్ పవర్‌ను వాడుకోలేకపోయాడు.

ఇప్పుడు కట్-టు-ప్రస్తుతానికి: NTR RRR, Devara సక్సెస్ తర్వాత హై ఆఫ్ His Career. ఇలాంటి టైమ్‌లో, అతనికి ఆఫర్ వచ్చింది: నెగటివ్ షేడెడ్ రోల్ – పూర్తి కంఫర్ట్ జోన్ నుంచి బయటికే. ఇంకా హైట్రిక్ రోషన్‌తో కోలాబ్. కానీ Ayan Mukherji, టాలెంటెడ్ అయినా, బ్లాక్‌బస్టర్ ఫీల్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. NTR టాలెంటెడ్ అయితే కూడా, ఫుల్ యుటిలైజ్ చేయలేదు.

ఫలితం? మళ్లీ రిపీట్: తెలుగు హీరోలను హిందీ భాష డైరెక్టర్లు హ్యాండిల్ చేయలేరు, కానీ మన సౌత్ డైరెక్టర్లు యూనివర్సల్ ఆక్సెప్ట్ పొందుతారు.

, , , , , ,
You may also like
Latest Posts from