ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (kalki 2898 AD). దీనికి సీక్వెల్ గా ‘కల్కి 2’ (kalki 2898 AD Sequel) రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విశేషాలు తెలుసుకునేందుకు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 2కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రెగ్యులర్ షూట్ జూలై నెలాఖరు నుంచి ప్రారంభించనున్నారని నిర్మాత అశ్వనీదత్ చెప్పుకొచ్చారు.
‘కల్కి 2898 ఏడీ’లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొణె.. పార్ట్ 2లోనూ కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపించనున్నారు’’ అని చెప్పారు.
‘కల్కి 2898 ఏడీ’తో పాటే సీక్వెల్‌కు సంబంధించిన షూట్‌ను కొంతమేర తీసినట్లు చెప్పారు. పార్ట్ 2కు సంబంధించి 35 శాతం షూట్ జరిగిందని వివరించారు.
వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఆడియన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రంలో అగ్ర నటులు అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామగా, కమల్ హాసన్.. సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలతో అలరించారు.
బౌంటీ ఫైటర్ భైరవగా సందడి చేసిన ప్రభాస్ చివర్లో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. రెండో భాగంలో అసలైన కథ మొదలవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇంటర్నేషన్ మార్కెట్‌లోనూ దీనిని గ్రాండ్‌గా రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.