రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’భాక్సాపీస్ దగ్గర ఏ రేంజిలో కలెక్షన్లలో దుమ్మురేపిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍‍బస్టర్ కొట్టింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది 2024 జూన్ 27వ తేదీన థియేటర్లలో రిలీజైంది. గ్రాండ్ విజువల్స్, మహాభారతం బ్యాక్‍డ్రాప్, ప్రభాస్ అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఓటీటీలోనూ ఈ చిత్రం దుమ్మురేపింది. ఇప్పుడు కల్కి 2898 ఏడీ చిత్రం టీవీ ఛానెల్‍లో తొలిసారి ప్రసారమయ్యింది. అయితే అక్కడ రిజల్ట్ మాత్రం షాక్ ఇచ్చింది. ఇన్ని చోట్ల చూసిన జనం టీవీల్లో చూడటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.

కల్కి 2898 ఏడీ సినిమా జనవరి 12వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రసారం అయ్యింది. సంక్రాంతికి రెండు రోజుల ముందే ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ అయ్యింది.

జీ తెలుగు టీవీ ఛానెల్ పబ్లిసిటీ బాగా చేసింది. ఈ నేపధ్యంలో కల్కి 2898 ఏడీ ఎంత టీఆర్పీ సాధిస్తుందో అనే విషయంపై ఆసక్తి ఎక్కువగా ఉంది.

అయితే టెలివిజన్ ప్రీమియర్ రేటింగ్ చూస్తే ..అర్బన్ లో 5.26 TRP వచ్చింది. ఆ తర్వాత రూరల్ మార్కెట్ లో 4.56 TRP వచ్చింది. ఇది ప్రభాస్ లాంటి హీరో సినిమాకు చాలా చాలా తక్కువ.

కల్కి 2898 ఏడీ చిత్రం ఓటీటీలోనూ భారీ వ్యూస్‍తో దుమ్మురేపింది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది.

హిందీ వెర్షన్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఉంది. ఈ చిత్రం ఓటీటీలో దుమ్మురేపింది. కొన్ని వారాల పాటు ఇండియా ట్రెండింగ్‍లో టాప్‍లో నిలిచింది.

గ్లోబల్ రేంజ్‍లోనూ ట్రెండింగ్‍లో సాగింది. ఇండియాతో పాటు చాలా దేశాల్లో కొన్ని రోజులు టాప్‍లో కొనసాగింది.

, , , ,
You may also like
Latest Posts from