సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కూలీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇదే రోజున హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ కూడా రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే ‘కూలీ’ టీజర్ త్వరలో విడుదల కానుందని సమాచారం. ఇక తెలుగు థియేట్రికల్ హక్కుల విషయంలో మాత్రం భారీ క్రేజ్ నెలకొంది. అన్ని కీలక ప్రొడక్షన్ హౌస్‌లు, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు ఈ హక్కుల కోసం నిర్మాతల వెంట పడుతున్నారు.

ఈ పోటీలో కింగ్ నాగార్జున ముందంజలో ఉన్నారు. ఈ చిత్రంలో ఆయనకూ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు భారీ రెమ్యూనరేషన్ కూడా చెల్లించినట్లు సమాచారం. ఇక ఇప్పుడు నాగార్జున స్వయంగా ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కుల కోసం తీసుకునే అవకాసం ఉందని తెలుస్తోంది ప్రస్తుతం ఈ ఎగ్రిమెంట్ పూర్తికావడానికి చివరి దశలో ఉంది.

వాస్తవానికి ఏషియన్ సునీల్ తో పాటు మరో ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నట్టు సమాచారం. నాగార్జున సైతం ఈ సినిమా తెలుగు హక్కుల కోసం పోటీ పడుతున్నారని, తమ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా దీనిని విడుదల చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. అలానే ‘దిల్’ రాజు (Dil Raju) సైతం ‘కూలీ’ హక్కుల కోసం సంప్రదింపులు జరుపుతున్నారట.

ఇదిలా ఉంటే… ఇటీవల సినిమా పంపిణీ రంగంలోకి అడుగుపెట్టిన సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi) సైతం ‘కూలీ’ హక్కుల్ని కోరుతున్నారట. ఆయనైతే ఏకంగా నలభై రెండు కోట్లు ఇవ్వడానికి సిద్థపడ్డారన్నది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. ‘జైలర్’ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ను దృష్టి పెట్టుకునే నాగవంశీ నలభై కోట్లకు పైగా ఇవ్వడానికి సిద్థపడ్డారని అంటున్నారు.

ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఉపేంద్ర, సౌబిన్ షాహీర్, సత్యరాజ్, శృతి హాసన్, రేబ మోనికా జాన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

, , , , ,
You may also like
Latest Posts from