సినిమా వార్తలు

సలార్ తర్వాత హారర్! ప్రశాంత్ నీల్ – మైత్రి కలయికలో సంచలనం

కేజీఎఫ్, సలార్ చిత్రాల హంగామా తర్వాత ప్రశాంత్ నీల్ ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ జోనర్‌లోకి అడుగుపెడుతున్నారు. ఎన్టీఆర్‌తో భీకర యాక్షన్ ఎపిక్ తెరకెక్కిస్తున్న నీల్, ఇప్పుడు యువ దర్శకుడు కీర్తన్ గౌడ తీస్తున్న హారర్ ఫిల్మ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు.

టాలెంట్‌కు ప్లాట్‌ఫాం ఇవ్వడంలో ముందున్న మైత్రీ మూవీ మేకర్స్ — భారీ సినిమాల మధ్యలో కూడా కంటెంట్ డ్రైవెన్ చిన్న సినిమాలకు దారులు తెరుస్తున్న ఈ బ్యానర్, ఈ న్యూ-ఏజ్ హారర్ మూవీని నిర్మిస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌లో సూర్య రాజ్ వీరభతిని, హను రెడ్డి, ప్రీతి పగడాల వంటి యువ నటులు ముందున్నారు. ఈరోజు అధికారిక పూజా కార్యక్రమం జరిగి మూవీకి శ్రీకారం చుట్టారు.

సైన్స్‌లో సైన్సూ — ఈ అనామలీని డీల్ చేసే స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రం, చిన్న బడ్జెట్‌లో అయినా హై-క్వాలిటీ కంటెంట్‌తో రావడం స్పెషల్ హైలైట్.

ప్రశాంత్ నీల్–మైత్రీ కాంబినేషన్ ఒక న్యూ-ఏజ్ హారర్ సినిమాను బ్యాక్ చేయడం… ఇది ఎందుకు అంత స్పెషల్? ఏం సీక్రెట్ ఉందీ ఈ కథలో? అన్న ఆసక్తి పెంచేలా ప్రాజెక్ట్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది.

Similar Posts