కుటుంబమంతా కలిసి చూసే సినిమాలు తగ్గిపోతున్న ఈ కాలంలో, ‘సారంగపాణి జాతకం’ ఓ ఒయసిస్సు అని చాలా మంది టీజర్, ట్రైలర్ చూసి ఫీలయ్యారు. ఈ సినిమా పెద్దల్నీ, పిల్లల్నీ నవ్వించే హాస్య యజ్ఞం గా దర్శక,నిర్మాతలు ప్రమోషన్స్ లో చెప్పారు. ఇందులో హత్య ఉందొ, భయం ఉందొ అనుకుంటూ వెళ్లినా… చివరికి నవ్వుతూ తిరిగొచ్చే ప్రయాణమవుతుంది అని నమ్మి వెల్లి వెళ్లినవారికి ఏం జరిగింది. వారి జాతకం బాగానే ఉంది, సినిమా కథేంటి?

స్టోరీ లైన్

సారంగపాణి (ప్రియదర్శి) ఓ కార్ సేల్స్‌మ్యాన్. కానీ అతని జీవితం స్టీరింగ్ పట్టుకోవడం కాదు, జాతకం పట్టుకోవడం! చెయ్యి చూచినవాళ్ల మాటే తను భవిష్యత్తు అనుకుంటూంటాడు. అయితే అతనికి రివర్స్ మనస్తత్వం కల ప్రాక్టికల్ మైండ్ మైథిలి (రూప కొడువాయూర్) మీద మనసుపెడతాడు.ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకుంటారు.

ఇంత వరకూ అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న తరుణంలో, హ‌స్త సాముద్రికుడైన జిగేశ్వరానంద (అవసరాల శ్రీనివాస్)ని కలుస్తాడు సారంగ. చేయి చూసి భ‌విష్య‌త్తులో ఓ మ‌ర్డ‌ర్ చేస్తావ‌ని చెబుతాడు. అస‌లే జాత‌కాల్ని అతిగా న‌మ్మే సారంగ… మ‌ర్డ‌ర్ భ‌యంతో త‌న పెళ్లిని వాయిదా వేసుకుంటాడు.

తన ప్రేమను కాపాడుకోవడానికి ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఏంటి? ఆ జాతకం నిజంగా జరిగిందా? మైథిలికి ఆ విషయం తెలుసా? అతని ఫ్రెండ్ చంద్ర (వెన్నెల కిషోర్) ఎలా రియాక్ట్ అయ్యాడు?ఈ కథకు కీలకమైన అహోబిల (తనికెళ్ల భరణి) పాత్ర ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు… సినిమాలో దొరుకుతాయి. జాతకంతో మొదలైన కథ, జోకులతో ఎక్కడికి వెళ్ళిందో తెలియాలంటే స్క్రీన్‌పైనే చూడాలి!

ఎలా ఉంది

లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్, కామెడీ ఇలా మల్టీ జోనర్ అంశాలను బేస్ చేసుకొని రూపొందిన సినిమా సారంగపాణి. అలాగే ఇది డైలాగులలో నాటకీయతను వెతుక్కున్న సినిమా. హాస్యంలో స్వచ్ఛతను కోరుకున్న సినిమా. “నవ్వించాలంటే అసభ్యత అవసరం లేదు” అనే మాటకు సాక్ష్యంగా నిలిచే సినిమా అనే చెప్పాలి. అయితే నలబై లోపు వాళ్లకు ఇదంతా ఛాదస్తంగా కూడా అనిపించవచ్చు.

ఈ సినిమాలో కొత్తదనం,కొత్తగా చెప్పిందేమీ లేదు. కానీ, పాతదాన్ని కూడా తేలికగా, ప్రెష్ గా చెప్పే ప్రయత్నం చేసారు. అందుకు ఇంద్రగంటి మార్క్ స్క్రీన్‌ప్లే ని అవసరమైంది. కథనంలో యాంత్రికత కాకుండా సహజత్వం ఉండటం కలిసొచ్చింది.

పాత్రల చెప్పే డైలాగుల్లో పదప్రయోగం భిన్నంగా ఉన్నాయి. ఆ ప్లోకి అలవాటుపడితే మనసుకు హాయిగా అనిపించే అనుభూతి మిగిలిపోతుంది. కాకపోతే రోత పుట్టిస్తుంది.

టెక్నికల్ గా…

వివేక్ సాగర్ మ్యూజిక్ – బీట్స్‌ను నవ్వుల్ని పెంచేలా ఉపయోగించుకోవడం మ్యూజిక్‌తో స్క్రిప్ట్ బలపడేలా చేసిన విద్య అనే చెప్పాలి.
పి.జి. విందా కెమెరా – సినిమా విజువల్స్ చక్కగా అందించింది. ఎడిటింగ్ – ఎక్కడా లాగ్ అనిపించదు. ఓ దశలో రీఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

నటీనటుల్లో …

ప్రియదర్శి, వెన్నెల కిశోర్, రూప, అవసరాల శ్రీనివాస్ – ఈ నలుగురూ తమ తమ పాత్రల్లో పూర్తిగా మునిగిపోయారు. ఒక్కో సన్నివేశంలో వారి కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్లు, డైలాగ్ డెలివరీ అన్నీ కలసి ఒక మంచి థియేట్రికల్ అనుభూతిని ఇస్తాయి.

వెర్డిక్ట్ –

“సారంగపాణి జాతకం” ఓ లైట్‌వెయిట్ కామెడీ రైడ్. కాలక్షేపానికి చూసేయచ్చు.

, , , , ,
You may also like
Latest Posts from