సినిమా వార్తలు

ప్రియమణి బికినీ గోల.ఇంతకాలం అయ్యినా మానలేదుగా

సౌత్ ఇండియాలోనే కాదు, ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఓటీటీ వరకు తన గ్లామర్ తో, యాక్టింగ్ తో సెగలు పుట్టిస్తోంది డస్కీ బ్యూటీ ప్రియమణి. నేషనల్ అవార్డ్ విన్నర్ గా ఎంత పేరు తెచ్చుకుందో, ‘ద్రోణ’ సినిమాలో బికినీ వేసి అంతకంటే పెద్ద దుమారాన్నే రేపింది. తాజాగా తన కెరీర్ లోని ఆ చీకటి కోణం గురించి, ఆ డైరెక్టర్ తనను ఎలా కన్విన్స్ చేశాడనే విషయంపై ప్రియమణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ప్రియమణి చేసిన ఒకే ఒక్క సాహసం.. నితిన్ సరసన ‘ద్రోణ’ సినిమాలో బికినీ ధరించడం. అప్పటి వరకు పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ, ఒక్కసారిగా టూ పీస్ లో కనిపించడంతో నెటిజన్ల మైండ్ బ్లాక్ అయ్యింది. దీనిపై తాజాగా స్పందిస్తూ.. “ఆ సీన్ చేయడానికి మొదట చాలా భయపడ్డాను, కానీ డైరెక్టర్ నన్ను బాగా కన్విన్స్ చేశాడు” అని బాంబు పేల్చింది. అప్పట్లో హిందీలో కరీనా కపూర్ వేసిన బికినీ సీన్ సెన్సేషన్ అవ్వడంతో, తనను కూడా అలాగే గ్లామరస్ గా చూపిస్తానని నమ్మించారని చెప్పుకొచ్చింది.

“స్విమ్మింగ్ పూల్ సీన్ ఉన్నప్పుడు చీరలు, జీన్స్‌లు వేసుకోలేం కదా, అందుకే ఆ పరిస్థితులకు తగ్గట్టుగా బికినీ వేయక తప్పలేదు” అంటూ హాట్ కామెంట్స్ చేసింది. ఆ సీన్ తర్వాత తనపై జరిగిన ట్రోలింగ్, వచ్చిన నెగటివిటీ చూసి షాక్ అయ్యానని, అప్పటి వరకు తనను హోమ్లీగా చూసిన ప్రేక్షకులు ఆ రూపాన్ని తట్టుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. నటిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు కంఫర్ట్ పక్కన పెట్టాల్సి వస్తుందని, కానీ ఇప్పుడు ఎవరైనా బికినీ వేయమంటే మాత్రం ససేమిరా అని తేల్చి చెప్పేసింది.

పెళ్లి తర్వాత కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ఫ్యామిలీ మెన్’ వంటి సిరీస్ లతో నేషనల్ లెవల్ క్రేజ్ సంపాదించుకున్న ప్రియమణి, ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ తో కలిసి ‘సరస్వతి’ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు చూసినా, ఆ బికినీ సీన్ మాత్రం తన జీవితంలో ఒక పెద్ద లెసన్ అని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.

మొత్తానికి డైరెక్టర్ మాట నమ్మి ఆరోజు బికినీ వేసినందుకు ప్రియమణి ఇప్పటికీ చర్చల్లో నిలుస్తోంది. గ్లామర్ ఫీల్డ్ లో ఇలాంటి ప్రయోగాలు ఎంత ప్రమాదకరమో ఆమె మాటలే సాక్ష్యం. మరి ప్రియమణి లేటెస్ట్ షాకింగ్ కామెంట్స్ పై మీరేమంటారు? ఆమె బికినీ లుక్ పై మీ పాత జ్ఞాపకాలు ఏంటో కింద కామెంట్ చేయండి!

Similar Posts