దర్శకుడు పూరి జగన్ తన కెరీర్‌లో చాలా క్లిష్టమైన పీరియడ్ లో ఉన్నాడు. అటు లీగల్ గానూ డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ పరాజయాలతో సహా పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఆయన తన తదుపరి చిత్రానికి హీరోని పొందడం చాలా కష్టంగా ఉంది. కొత్త దర్శకులు ఇండస్ట్రీకి రావటం, తను ఫేడవుట్ అవటం సమస్యల్లో పడేస్తోంది. దాంతో ఆయన కథలు పట్టుకుని చాలా మంది హీరోల చుట్టూ తిరుగుతున్నారు. కానీ అందరూ బిజిగా ఉన్నారు. ఈ క్రమంలో పూరి జగన్ నాగార్జునను టార్గెట్ చేసుకున్నాడని తెలుస్తోంది.

తాజాగా పూరీ జగన్ నాగార్జునతో ఓ సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. నా సామి రంగ తర్వాత నాగార్జున మెయిన్ లీడ్ హీరోగా ఏ కొత్త చిత్రానికి సైన్ చేయలేదు.

కానీ నాగార్జున ప్రస్తుతం ధనుష్ మెయిన్ లీడ్ హీరోగా నటించిన శేఖర్ కమ్ముల కుబేరులో సెకండ్ లీడ్ గా పనిచేస్తున్నాడు. అలాగే, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు.

దాంతో నాగార్జున తాను స్టెయిట్ హీరో గా ఓ సినిమాకు సైన్ చేసేందుకు టైమ్ తీసుకుంటున్నాడు. పూరి జగన్, నాగార్జున గతంలో సూపర్ మరియు శివమణి చిత్రాలు చేసారు.

అయితే నాగార్జున స్క్రిప్ట్‌కి ఓకే చెబితే, ఈ ప్రాజెక్ట్ వెంటనే సెట్‌పైకి వెళ్తుంది ఎందుకంటేనాగ్, పూరి ఇద్దరికీ లైన్‌లో కమిట్‌మెంట్లు లేవు.

,
You may also like
Latest Posts from