ప్రభాస్ – పేరు వింటేనే థియేటర్లు హౌస్‌ఫుల్, టికెట్లు క్షణాల్లో మాయం అయ్యే మాస్ ఫీవర్. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆయన, ఇప్పుడు మరొక విభిన్నమైన హారర్ కామెడీతో వస్తున్నారు. అది కూడా యువ ప్రేక్షకులకు బాగా హిట్టయ్యే జానర్. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ అనే సినిమా పట్ల బోలెడంత క్రేజ్ నెలకొంది.
ఇప్పటికే లీక్లలోని లుక్స్, పోస్టర్లు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేలా టీజర్ రాబోతోంది. అదీ థియేటర్లలో ప్రదర్శించబోతోంది!
ప్రభాస్ – పేరు వింటేనే థియేటర్లు హౌస్‌ఫుల్, టికెట్లు మిస్ అయ్యే మాస్ ఫీవర్. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆయన, ఇప్పుడు మరొక విభిన్నమైన హారర్ కామెడీతో వస్తున్నారు. అది కూడా యువ ప్రేక్షకులకు బాగా హిట్టయ్యే జానర్. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ అనే సినిమా పట్ల బోలెడంత క్రేజ్ నెలకొంది.
ఇప్పటికే లీక్లలోని లుక్స్, పోస్టర్లు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేలా టీజర్ థియేటర్లలో ప్రదర్శించబోతోంది!
వివరాల్లోకి వెళితే.. :
ప్రభాస్ అభిమానులు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న, హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘రాజా సాబ్’ టీజర్ ఈ నెల 16న విడుదల కానుంది.
చిత్ర టీమ్ తాజా అప్డేట్ ప్రకారం, టీజర్‌ను దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ థియేటర్ల జాబితాను త్వరలో ప్రకటించనున్నారు.
తాజాగా యూరప్ ట్రిప్ నుంచి తిరిగిన ప్రభాస్, తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు స్పెషల్ హైలైట్‌గా నిలవనుందని బజ్. మలవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
ఇంకా కొంత షూటింగ్ పనులు మిగిలి ఉన్నా, వాటిని త్వరలో పూర్తి చేసి, డిసెంబర్ 5న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
రాజా సాబ్ టీజర్ థియేటర్లలోనే చూడటం ఓ రేర్ ఫీలింగ్ అవ్వబోతోంది. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది అద్బుతమైన ట్రీట్!