రజనీకి “కూలీ” కలెక్షన్లు మొదట్లో బాగానే వచ్చాయి కానీ మిక్స్ టాక్ వల్ల వీక్‌డేస్‌కే పడిపోయాయి. ఇలాంటి టైమ్‌లో సన్ పిక్చర్స్ ఒక కొత్త టర్న్ తీసుకొచ్చింది – సినిమా కి వచ్చిన ‘A’ సర్టిఫికెట్ మీద మద్రాస్ హైకోర్ట్‌కి వెళ్లారు. “మా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ దక్కాలంటే ‘U/A’కి మార్చండి” అని కోర్ట్‌ని అడిగారు.
వాస్తవానికి మల్టీప్లెక్సుల్లో రెవిన్యూ మీద సెన్సార్ ఇచ్చిన ఏ సర్టిఫికెట్ ప్రభావం తీవ్రంగా పడింది. 18 లోపు వయసున్న పిల్లలను అనుమతించకుండా రూల్స్ కఠినంగా పాటించడంతో చాలా ఫ్యామిలీస్ రజని సినిమాకు దూరంగా ఉన్నాయి. ఇది వసూళ్లను బాగా దెబ్బ కొట్టిన మాట నిజం.
డ్యామేజ్ గుర్తించిన సన్ పిక్చర్స్ రంగంలోకి దిగింది, సంస్థ తరఫున లాయర్ జె రవీంద్రన్ ఎమర్జెన్సీ హియరింగ్ కోసం పిల్ వేయడంతో రేపు దాని మీద వాదోపవాదాలు జరగనున్నాయి. చాలా ఎక్కువ వయొలెన్స్ ఉన్న కెజిఎఫ్ లాంటి సినిమాలకు యు/ఏ ఇచ్చినప్పుడు కూలికి మాత్రమే అడల్ట్స్ ఓన్లీ ఇవ్వడం పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తూ సన్ కంపెనీ న్యాయస్థానంలో కేసు వేసింది.
కానీ ఇక్కడే ట్విస్ట్ ఈ పని సినిమా రిలీజ్‌కు ముందే చేసుంటే వాల్యూ ఉండేది. ఇప్పుడు థియేట్రికల్ రన్ క్లోజ్ అవబోతున్న టైమ్‌లో సర్టిఫికేట్ మార్చిస్తే ఏమవుతుందంటే? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే కదా.
అదే జైలర్‌కి కూడా హై వయలెన్స్ ఉన్నా ‘U/A’ ఇచ్చారు. కూలీకి మాత్రం డైరెక్ట్ ‘A’ వేసేసారు. ఇదే ఇప్పుడు సన్ పిక్చర్స్‌కి మిగిలిన టెన్షన్.
మొత్తానికి, లోకేశ్ కనగరాజ్ స్టైల్ మాస్ ఎంటర్‌టైనర్ అయినా, సెన్సార్ సర్టిఫికేట్ రజనీ సినిమాకి కొత్త హడావుడి తీసుకొచ్చింది.