ప్రతిష్టాత్మక చిత్రం RRRలో భగభగ మండే  బ్రిటిష్ ఆఫీసర్‌గా ఆకట్టుకున్న రామ్ చరణ్ గ్యాప్ తీసుకుని నిజాయితీగల IAS అధికారిగా తిరిగి వచ్చాడు. ‘గేమ్ ఛేంజ‌ర్‌’లో  అవినీతిపరుడు, దయా దాక్షిణ్యం అంటూ లేని ఓ పవర్ ఫుల్  మంత్రిని ని ఈసారి ఎటాక్ చేసాడు. రామ్ చరణ్ యాంగ్రీ మేనేజ్మెంట్ పాఠాలు పాటించే ఓ స్టూడెంట్ గా,  అలాగే తను నమ్మిన సిద్దాంతానికి ప్రతినిథిగా ఉన్న గిరిజన నాయకుడిగా కూడా కనిపిస్తాడు.  ఇలా రామ్ చరణ్ కష్టపడి చేసిన ఈ సినిమా అతని కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడుతుంది. ఈ సినిమా కథేంటి వంటి వివరాలు చూద్దాం.

స్టోరీ లైన్

విశాఖకు కలెక్టర్  గా రామ్ నంద‌న్ (రామ్ చ‌ర‌ణ్‌)  వ‌స్తాడు. అప్పటికి ఆంధ్రాలో  అభ్యుద‌యం పార్టీ అధికారంలో ఉంటుంది. ముఖ్య‌మంత్రి స‌త్య‌మూర్తి (శ్రీ‌కాంత్) తిరుగులేని నాయకుడు. కొన్ని కారణాలతో అవినీతిని ప్రక్కన పెట్టి ప్రజలకు సేవ చేద్దామని తన వాళ్లకు చెప్తారు. కానీ ఈ మాటలు పార్టీలో ఎవరికీ రుచించవు. మరీ ముఖ్యంగా ఆయన ఎప్పుడు పోతాడా అని ఎదురుచూసే కొడుకు మోపీదేవి (ఎస్‌.జె.సూర్య‌)కు మరీను. మోపిదేవి జీవితాశయం సీఎం కూర్చీలో కూర్చిని, అక్కడే రిటైరై, అక్కడే చనిపోవటం. అందుకోసం ఎంతకైనా దిగజారతానికి సిద్దపడుతూంటాడు.

ఈ లోగా   ఈలోగా స‌త్య‌మూర్తి చ‌నిపోతాడు. ఆయన స్థానంలో ముఖ్య‌మంత్రి గా మోపీదేవి ఎన్నిక కావాల్సి ఉంది. మోపీదేవినే అందరూ ముఖ్యమంత్రి అని అంతా ఫిక్స‌యిపోయే టైమ్ లో ఓ ట్విస్ట్ వచ్చి పడుతుంది.  రామ్ నంద‌న్‌ ని తన వారసుడుగా ప్రకటించి ముఖ్యమంత్రి చనిపోయారనే నిజం బయిటకు వస్తుంది. దాంతో రామ్ నందర్ ముఖ్యమంత్రి అయ్యే సిట్యువేషన్. బయిటనుంచి వచ్చి ఇలా ముఖ్యమంత్రి అవుతానంటే ఎవరు ఒప్పుకుంటారు. అక్కడే అదే జరిగింది. రాజకీయాలు మొదలయ్యాయి. చివరకు ఏమైంది. అసలు ముఖ్యమంత్రికి, రామ్ నందన్ ని తన వారసుడుగా ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది. చివరికి ఏమైందనేది మిగతా కథ.

 హైలెట్స్ 

 ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఇప్పుడు డౌన్ అయిన దర్శకుడు శంకర్ ఈ సినిమాతో మరోసారి తనలోని విషయం అయ్యిపోయిందా అనే అనుమానం కలిగించాడు.

బోర్ కొట్టించే, ప్రెడిక్టబుల్ స్క్రిప్టు సినిమాని దెబ్బకొట్టింది.  దాంతో నటుడుగా రామ్ చరణ్ ఎంత కష్టపడినా అది బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.

ఫస్టాఫ్ మొత్తం హీరో బిల్డప్ లకు, విలన్ పరిచయానికే సరిపోయింది. కథలోకి బాగా మెల్లిగా దాదాపు ఇంటర్వెల్ దాకా రాలేదు.

అలాగే రామ్ చరణ్ మరియు కియారా అద్వానీల మధ్య నడిపిన ప్రేమ కథ బాగోలేదు. తగినంత డెప్త్ లేదు.

దర్శకుడు శంకర్ తన మునుపటి హిట్‌ అయిన “ఒకే ఒక్కడు”నే మళ్లీ తీసినట్లు అనిపిస్తుంది.

విలన్ మేనరిజంలు, సీన్స్ మీద పెట్టిన శ్రద్ద హీరో మీద పెట్టలేదనిపిస్తుంది.

తమిళ నటుడు SJ సూర్య అక్రమ వ్యాపారంలో మునిగిపోయి ముఖ్యమంత్రి కావాలనుకునే రాజకీయ నాయకుడిగా నటించారు.

సినిమా సెకండాఫ్ లో వచ్చే అప్పన్న ఎపిసోడ్ బాగుంది, ఆ ఎపిసోడ్ లో అంజలి బాగా చేసింది.

టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ ఉన్నాయి. కెమెరా వర్క్ గుర్తుండిపోతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది.

 ఎడిటింగ్ ..ఎమోషన్స్ ని ఎడిట్ చేసేసిందేమో అనిపిస్తుంది. డైరక్టర్ గా శంకర్ … కొత్త తరానికి తగినట్లుగా తీయలేకపోయారు. నిర్మాత దిల్ రాజు బాగా ఖర్చు పెట్టారు.

చూడచ్చా

రామ్ చరణ్ అభిమానులుకు ఈ సినిమా నచ్చుతుంది. మిగతా వాళ్లగా సోసోగా ఉంటుంది. శంకర్ మార్క్ సినిమా చూసి చాలాకాలం అయ్యింది అనుకుంటే ఓ లుక్కేయండి. లేకపోతే ఓటిటిలో వచ్చేదాకా ఆగండి. 

,
You may also like
Latest Posts from