
రామ్ నెక్ట్స్ ప్రాజెక్టులు, కొడితే కుంభస్దలమే
ఎనర్జి అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రామ్ పోతినేని. ఎన్ని ఫ్లాపులు వచ్చినా, ఎన్ని స్క్రిప్ట్ రిస్కులు తీసుకున్నా, దెబ్బలు తిన్నా — “ఈ హీరో లో స్పీడ్, స్పార్క్ తగ్గదు” అన్నది ఆడియన్స్ కామన్ ఫీలింగ్. రామ్ కెరీర్ ఇప్పుడే కొత్త ఫేజ్‌లోకి దూసుకెళ్తోంది. పాన్-ఇండియా లెవల్‌లో తన ఎనర్జీకి, స్టైల్‌కు, మాస్ అటిట్యూడ్‌కి కొత్త మార్కెట్ క్రియేట్ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటూ ఉన్నాడు.
ఇటీవలే వచ్చిన ఆంధ్రా కింగ్ తాలూకా — రివ్యూల విషయం పక్కన పెడితే — యంగ్ ఆడియన్స్‌తో రామ్ కనెక్ట్ అయినట్లు బాగా కనిపించింది. USA ప్రమోషన్‌లలో కూడా సినిమా బజ్ డీసెంట్ గా కొనసాగుతుండటం ఇండస్ట్రీని సర్‌ప్రైస్ చేసింది. మిక్స్డ్ టాక్ ఉన్నా, రామ్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌కి వచ్చిన పాజిటివ్ రిస్పాన్స్ అతని కెరీర్ కొత్త దిశలో పయనించబోతోందనే హింట్ ఇస్తోంది.
డిసెంబర్ మొత్తం బ్రేక్ తీసుకోబోతున్న రామ్, కొత్త సినిమా షూట్‌ను వచ్చే ఏడాది మొదటి వారాల్లోనే స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను డెబ్యూటెంట్ కిషోర్ డైరెక్ట్ చేస్తుండగా, బ్యాక్‌ఎండ్‌లో Arka Media Works భారీ స్కేల్‌పై సిద్ధమవుతోంది. జూన్ 2026కి షూట్ పూర్తిచేసి, అదే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనే ప్లాన్ ఫిక్స్ అని ఇండస్ట్రీ టాక్.
రామ్‌కు మరో పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీగా ఉందా?
తమిళంలో నటుడిగానూ, దర్శకుడిగానూ అందరిలోనూ రిజెక్ట్ చేయలేని రేంజ్‌లో ఉన్న సముద్రఖని, రామ్ కోసం ప్రత్యేకంగా ఒక స్ట్రాంగ్ ఎమోషనల్–యాక్షన్ డ్రామా రెడీ చేశాడట. ఇటీవలే ఈ స్క్రిప్ట్‌ని రామ్‌కు నేరేట్ చేయగా… “ఇది చేస్తే రామ్ కెరీర్ దిశే మారిపోతుంది” అన్న బజ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది.
ఈ కొత్త ప్రాజెక్ట్‌ను KVN Productions బ్యాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే — అనౌన్స్‌మెంట్ వెంటనే డ్రాప్ అవుతుందని ఇండస్ట్రీ సమాచారం.
ప్లాఫ్ లలో ఉన్నా రామ్ వరుసగా రెండు సినిమాలు లైన్‌లో పెట్టడం… సముద్రఖని లాంటి ఇంటెన్స్ ఫిల్మ్‌మేకర్‌తో కలయిక… ఇది స్ట్రైట్‌గా “career redefining phase loading” అన్నట్టే!
