సినిమాలకన్నా సోషల్ మీడియాలో రష్మిక మందన్నా పేరు ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఈ జెనరేషన్ క్రష్‌గానే కాకుండా, పాన్ ఇండియా స్టార్‌గా ఎంతో క్రేజ్ సంపాదించిన రష్మిక… తాజాగా కాంట్రవర్సీల వల్లనే నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. కానీ ఈ ప్రచారం ఆమెను ఇబ్బందిపెట్టుతోందట!
ఇటీవలి రోజులుగా ప్రచార కార్యక్రమాల్లో ఆమె చెప్పిన చిన్న చిన్న మాటల్ని కూడా మీడియా పెనుదాడిగా మారుస్తోందని రష్మిక అభిప్రాయం. తానెంత సంయమనం పాటించినా… తక్కువగా మాట్లాడినా… ఏదో ఒక పదం వైరల్ అయి, కొత్త కాంట్రవర్సీకి కారణమవుతోందని వాపోతోంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ ఇంకా వేగంగా విరుచుకుపడుతున్నారు.
‘యానిమల్’ సినిమాలో ఆమె పాత్రపై స్పందన, రణబీర్ కపూర్ గురించి ఆమె వ్యాఖ్యలు, కర్ణాటక-కన్నడ అంశాలపై వచ్చిన వాదనలు – ఇవన్నీ ఆమెను మరింత సమస్యల్లోకి నెట్టాయి.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే… ఇకపై మరింత జాగ్రత్తగా మాట్లాడాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయినా ఓ వైపు ‘కుబేరా’లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే, మరోవైపు తన తదుపరి చిత్రం “ది గర్ల్‌ఫ్రెండ్” కోసం ప్రచారానికి సిద్ధమవుతోంది రష్మిక.
కాంట్రవర్సీలు వెంటాడినా… ఆమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు!