సినిమా వార్తలు

BMW రవితేజ కెరీర్‌కు ఎందుకు అత్యంత కీలకమైన సినిమా కావచ్చు?

ఒకప్పుడు రవితేజ సినిమా రిలీజైతే… హిట్ టాక్ అవసరం లేదు. థియేటర్లకు జనాలు ఆటోమేటిక్‌గా వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఓపెనింగ్ డే షోకే కష్టపడాల్సిన స్థితి. అలాంటి టైంలో రవితేజ తీసుకున్న ఓ నిర్ణయం — ఆయన కెరీర్‌ను నిలబెట్టొచ్చు… లేక పూర్తిగా మలుపు తిప్పొచ్చు. అదే సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి (BMW)’.

పడిపోయిన గ్రాఫ్ నిజం

“మాస్ మహారాజా” అనే ట్యాగ్ ఒకప్పుడు రవితేజకు బ్రాండ్. కానీ అదే ట్యాగ్ క్రమంగా ఆయనకు భారంగా మారింది. ప్రేక్షకులు తన దగ్గర నుంచి మాస్ మాత్రమే కోరుకుంటున్నారన్న భ్రమలో — అవసరం లేని యాక్షన్, అరుపులు, అతిశయ హీరోయిజంతో సినిమాలు వచ్చాయి. ఫలితం? ఖిలాడి , మాస్ జాతర లాంటి భారీ డిజాస్టర్లు. ఒకప్పుడు ఫ్లాప్ అయినా ఓపెనింగ్స్ గ్యారంటీగా వచ్చేవి. ఇప్పుడు మాత్రం తొలి రోజే థియేటర్లు ఖాళీగా కనిపించాయి. ఇది రవితేజ కెరీర్‌లో అత్యంత దారుణమైన దశ.

BMWతో రిస్క్ గేమ్

ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన సినిమా — భర్త మహాశయులకు విజ్ఞప్తి . ఇక్కడే రవితేజ అసలు షాక్ ఇచ్చాడు. ఏళ్ల తర్వాత తొలిసారి “మాస్ మహారాజా” ట్యాగ్ లేకుండా సినిమా.
అంతే కాదు… ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ రెమ్యూనరేషన్ తీసుకోలేదు. నిర్మాత సుధాకర్ చెరుకూరి స్వయంగా చెప్పిన విషయం ఇదే. రవితేజ పెట్టిన ఒక్క కండిషన్ —సినిమా సంక్రాంతికే రిలీజ్ కావాలి.

కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా వచ్చే సీజన్. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయితేనే పని అవుతుందన్న రియాలిటీని రవితేజ అంగీకరించాడు. ఇదే ఆయన మైండ్‌సెట్‌లో వచ్చిన పెద్ద మార్పు.

ఇంకో కీలక నిర్ణయం – ప్రేక్షకుల వైపు అడుగు

ఇక్కడితో ఆగలేదు. సంక్రాంతి సీజన్ పేరుతో టికెట్ రేట్లు పెంచే ట్రెండ్‌కు మేకర్స్ బ్రేక్ వేశారు. టికెట్ ధరలు పెంచబోమని స్పష్టంగా ప్రకటించారు. ఇది నేరుగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే స్ట్రాటజీ. ఈ పరిస్థితుల్లో ఇది చాలా స్మార్ట్ మూవ్.

కెరీర్‌కు డిసైడింగ్ మూవీ

కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్. ఈ సినిమా హిట్ అయితే — రవితేజకు ఇది కమ్‌బ్యాక్ మాత్రమే కాదు, తన కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్లే టర్నింగ్ పాయింట్.

కానీ ఫెయిల్ అయితే — ఇది ఇక రవితేజ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకం వేసే సినిమా అవుతుంది. ఇది మామూలు రిలీజ్ కాదు. ఇది రవితేజ కెరీర్ పరీక్ష. అందుకే… BMW కేవలం సినిమా కాదు — ఒక నటుడి అస్తిత్వానికి వేసిన పందెం.

Similar Posts