తమిళ హీరో సూర్య (Suriya) తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేయాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ఎన్నో కథలు విన్నారు. చివరకు ఓ కథ సెట్‌ అయింది. తెలుగులో స్ట్రెయిట్‌ సినిమాకు సై అన్నారు. వెంకీ అట్లూరి (Venki Atluri) దర్శకత్వంలో ఆయన ఈ చిత్రాన్ని చేయనున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (Sitara Entertainments) సంస్థ నిర్మించనున్నట్లు సూర్య ‘రెట్రో’ ప్రీరిలీజ్‌ వేడుకలో అఫీషియల్‌గా వెల్లడించారు. మేలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిపారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారు. సూర్య మార్కెట్ తెలుగులో పూర్తిగా డౌన్ గా ఉన్న ఈ సమయంలో ఏ మేరకు ఈ సినిమా సక్సెస్ అవుతుంది, అలాగే సూర్యకు ఎంత పే చేస్తున్నారు వంటి విషయాలు చూద్దాం.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నిమిత్తం 120 కోట్లు దాకా ఖర్చు పెట్టబోతున్నారు. అందులో 50 కోట్లు కేవలం సూర్య రెమ్యునరేషన్ క్రిందే ఇస్తున్నారు. ఇంకా టైటిల్ ఏదీ పెట్టని ఈ సినిమా సూర్య కెరీర్ లోనే టాప్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

వెంకీ అట్లూరి మాట్లాడుతూ “నా కాలేజ్ లైఫ్ లో సూర్య గారి సినిమా ఒక పాఠం లాంటిది. గజినీ సినిమా చూసి.. ఒక సినిమా ఇలా కూడా ఉంటుందా? ఒక నటుడు ఇంత కష్టపడతారా? అనుకున్నాను. నేను సినీ పరిశ్రమలోకి రావాలి అనుకుంటున్నప్పుడు చూసిన సినిమా అది. నాకెప్పుడూ ప్రత్యేకమైనదే.

ఇక ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ అయితే.. అది సినిమా కాదు, అదొక టెక్స్ట్ బుక్. ప్రేమలో ఎలా పడాలో నేర్పింది, విఫలమైతే దాని నుంచి ఎలా బయటపడాలో నేర్పింది, క్రమశిక్షణ కూడా నేర్పింది. సూర్య గారు ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయన ప్రతి సినిమా నుంచి ఏదోకటి నేర్చుకున్నాము. ” అన్నారు.

, ,
You may also like
Latest Posts from