
రేణు దేశాయ్ విశ్వరూపం: “నీ రేటు ఎంత?” అని అడిగిన వాడికి చుక్కలు చూపించిన పవన్ మాజీ భార్య!
నటి, దర్శకురాలు రేణు దేశాయ్ సోషల్ మీడియాలో జరుగుతున్న వికృత చేష్టలపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తనను ఉద్దేశించి అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్న వారిపై ఆమె యుద్ధం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా కాకుండా, ఒక బాధ్యతాయుతమైన మహిళగా ఆమె ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఒక నెటిజన్ అడిగిన నీచమైన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
“ఒక్క నైట్ కి నీ రేటు ఎంత?”
ఇన్స్టాగ్రామ్ వేదికగా రేణు దేశాయ్ లైవ్‌లోకి వచ్చిన సమయంలో ఒక ఆకతాయి అత్యంత దారుణమైన ప్రశ్న వేశాడు. దీనిపై రేణు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నేను కాశీలో దేవీ రూపంలో ఉన్న బట్టలు వేసుకుని, ఒళ్లంతా కప్పుకుని ఉన్నాను. అంత పద్ధతిగా ఉన్న నన్నే ఇలాంటి అసహ్యకరమైన ప్రశ్న అడగడానికి నీకు ఎంత ధైర్యం?” అంటూ ఆమె నిప్పులు చెరిగారు. తిండికి గతిలేని వారు కూడా ఫోన్ చేతిలో ఉంది కదా అని ఇలాంటి వెర్రి వేషాలు వేస్తున్నారని, ఇలాంటి నాన్సెన్స్ వెంటనే ఆపాలని హెచ్చరించారు.
పోలీస్ కేసు.. ఇంటికి వచ్చి మరీ కొడతా!
కేవలం తిట్టడమే కాదు, ఇలాంటి వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా రేణు సిద్ధమయ్యారు. “నేను ఏ ఎమ్మెల్యేనో, ప్రభుత్వ అధికారిని కాదు. సినిమాల్లో పనిచేస్తున్నంత మాత్రాన నాపై ఇలాంటి కామెంట్స్ చేసే హక్కు ఎవరికీ లేదు. మీ ఫోన్లలో డేటా ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు వాగితే ఊరుకోను” అని స్పష్టం చేశారు. ఇప్పటికే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నానని, నేరుగా నిందితుల ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులను కలిసి “మీ కొడుకును పెంచిన పద్ధతి ఇదేనా?” అని నిలదీస్తానని వార్నింగ్ ఇచ్చారు.
నిరాశ, నిస్పృహల్లో ఉన్నవారే ఇలా చేస్తారు!
సోషల్ మీడియాలో చాలామంది ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ లో ఉన్నారని, అందుకే ఇతరులపై ఇంత సులభంగా ద్వేషాన్ని చిమ్ముతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఆడవారైనా, మగవారైనా ఇలాంటి వేధింపులకు గురైతే భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని ఆమె పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను విషతుల్యం చేస్తున్న ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆమె ఘాటుగా పేర్కొన్నారు.
రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాయి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై పడి ఏడ్చే వారికి ఇది ఒక గట్టి చెంపదెబ్బ లాంటిదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి రేణు వార్నింగ్ తర్వాత అయినా ఈ ఆకతాయిల ఆగడాలు ఆగుతాయా లేదా అన్నది చూడాలి.
