
ఒకప్పుడు “శివ”తో తెలుగు సినిమా నిబంధనలన్నీ తలకిందులు చేసిన రామ్ గోపాల్ వర్మ, తర్వాత బాలీవుడ్‌లో “సర్కార్” సిరీస్‌తో రాజకీయ మాఫియా డ్రామా జానర్‌కి కొత్త నిర్వచనం ఇచ్చాడు.
“సర్కార్” (2005) బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి, అమితాబ్ బచ్చన్‌కు గాడ్‌ఫాదర్ ఇమేజ్‌ను క్రియేట్ చేసింది. తరువాతి భాగం “సర్కార్ రాజ్” (2008) కూడా స్ట్రాంగ్ కంటెంట్‌తో మంచి హైప్ క్రియేట్ చేసింది. అయితే “సర్కార్ 3” (2017) మాత్రం ఆ రేంజ్‌లో సక్సెస్ ఇవ్వలేకపోయింది.
ఇప్పుడు, మళ్లీ వర్మ చేతిలో ఆ రాజకీయం చీకటినుంచి వెలుగులోకి వస్తుందట! ఇండస్ట్రీ టాక్ ప్రకారం, రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే “సర్కార్ 4” కథను అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లకు పిచ్ చేశాడు. బిగ్ బీ కూడా ఆ కాన్సెప్ట్‌పై ఆసక్తి చూపుతున్నాడట!
ఇంతలోనే వర్మ మనోజ్ బాజ్‌పేయీతో కొత్త సినిమా షూట్ చేస్తుండగా, అది 2026 ప్రారంభంలో విడుదల కానుంది. పోలిటికల్ ఫిల్మ్స్, సోషల్ మీడియా వివాదాల తర్వాత వర్మా మళ్లీ డైరెక్టర్ వర్మగా తిరిగి వస్తున్నాడు.
సినీ వర్గాల్లో ఒక్క మాటే వినిపిస్తోంది —
“సర్కార్ మళ్లీ వస్తున్నాడు… ఈ సారి వర్మ పాత ఫార్మ్‌లో!”
చిన్న ప్రశ్న మాత్రం మిగిలింది —
ఈ సారి వర్మా ముంబై సింహాసనం తిరిగి దక్కించుకుంటాడా?
