బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan)పై దాడికి పాల్పడిన అసలైన నిందితుడిని ముంబై పోలీసులు(Mumbai Police) అరెస్ట్‌ చేసిన సంగతి తెలసిందే. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం అతడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఇదిలాఉండగా, నిందితుడిని పట్టుకోవడంలో యూపీఐ పేమెంట్‌ కీలకంగా మారినట్లు తెలుస్తోంది.

నిందితుడిని పట్టుకునేందుకు సుమారు 300 మంది పోలీసులు శ్రమించినట్లు తెలుస్తోంది. ఈ గాలింపులో దాదాపు 600 సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం.

దీనిద్వారా నిందితుడి నంబర్‌ తెలుసుకున్న పోలీసులు లొకేషన్‌ ట్రేస్‌ చేశారని.. ఆవిధంగా అతడు ఠానేలో ఉన్నట్లు గుర్తించారని సమాచారం. పోలీసులను చూసి అతడు అక్కడినుంచి పారిపోవాలని చూడగా.. ఒక్కసారిగా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.

ప్రాథమిక విచారణలో నిందితుడు తక్కువ వ్యవధిలో త్వరగా డబ్బు సంపాదించాలనుకుంటున్నట్లు పోలీసులకు వెల్లడించాడు. నిందితుడు పశ్చిమ బెంగాల్‌కు చెందినవాడు. అయితే, ముంబైలో వర్లీ కోలివాడ సమీపంలో ఉండేవాడు. సైఫ్‌పై దాడి వల్ల అరెస్టు భయంతో ఇటీవలే థానే హీరానందానీకి అతను మకాం మార్చాడు.

వెస్ట్ రీజియన్ అదనపు పోలీసు కమిషనర్ పరంజిత్ దహియా, డీసీపీ జోన్ 09 దీక్షిత్ గెడం ఆధ్వర్యంలో దయా నాయక్ నేతృత్వంలోని క్రైమ్ బ్రాంచ్ టీమ్ యూనిట్ -9 నిందితుడిని కనిపెట్టింది.

,
You may also like
Latest Posts from