పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ పై సల్మాన్ ఖాన్ తో పాటు మరికొందరు బాలీవుడ్ హీరోలు కనీసం నోరు మెదపలేదు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే విషయం మరోసారి చర్చనీయాంశం అయ్యింది.

సల్మాన్ ఖాన్ తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫొటోను షేర్ చేయగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. గల్వాన్ యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ పెట్టిన సల్మాన్‌పై, నకిలీ దేశభక్తి చూపిస్తున్నాడని ఫ్యాన్స్ ఫైరయ్యారు.

ఈ ఏడాది ఆరంభంలో పహల్గామ్ దాడులు, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఇండియన్ ఆర్మీకి మద్దతుగా ముందుకు వచ్చారు. కానీ అప్పట్లో సల్మాన్ మౌనం వహించడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. ఆపరేషన్ ముగిసిన తర్వాత మాత్రమే స్పందించాడని ఆగ్రహం వ్యక్తమైంది.

ఇప్పుడైతే దేశభక్తి సినిమా ప్రమోషన్లలో చురుకుగా కనిపించడం, ఫ్యాన్స్ లో వ్యతిరేకత రేపింది. “దేశం కోసం మాట్లాడలేకపోయినవాడు, దేశభక్తిని సినిమాకి అమ్ముకుంటున్నాడు” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. షూటింగ్ సెట్‌లోని ఒక క్లాప్‌బోర్డ్ హైడ్ చేసిన లుక్ సోషల్ మీడియాలో మరింత వాదనలకు తావిచ్చింది.

సపోర్టర్స్ మాత్రం – సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టకపోయినా, దేశభక్తిని చూపడానికి అది ఒక్కటే మార్గం కాదని అంటున్నారు. కానీ విమర్శకులు మాత్రం స్పష్టంగా చెబుతున్నారు – “దేశభక్తి బాక్సాఫీస్ కోసం కాదు, నిజమైన పరీక్షా సమయంలో సపోర్ట్ గా నిలబడే గుణం కావాలి.”

ఈ వివాదం మరోసారి చూపించింది – సెలబ్రిటీల చెప్పే మాటలు, చేసే చేష్టలు కలిసొచ్చినప్పుడు మాత్రమే ప్రజలు నమ్మకం పెడతారని.

, , , , ,
You may also like
Latest Posts from