పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ వింటేజ్ లుక్స్‌తో అలరించినప్పటికీ, కథ మరియు స్క్రీన్‌ప్లే ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. “అసలు డార్లింగ్ ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడు?” అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ముందే పసిగట్టి తప్పుకున్నారా?
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. మారుతి ఈ కథను మొదట ప్రభాస్ కోసం రాయలేదట. ఈ స్టోరీ లైన్ విన్న ఇద్దరు స్టార్ హీరోలు సున్నితంగా రిజెక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది.
నేచురల్ స్టార్ నాని: మారుతి-నాని కాంబోలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ బ్లాక్ బస్టర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. అదే నమ్మకంతో మారుతి ఈ హారర్ కామెడీ కథను నానికి వినిపించగా.. తన బాడీ లాంగ్వేజ్‌కు ఇది సెట్ అవ్వదని ఆయన పక్కన పెట్టేశారట.
కోలీవుడ్ స్టార్ సూర్య: నాని తర్వాత ఈ ప్రాజెక్ట్ తమిళ స్టార్ సూర్య వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కారణాల వల్ల సూర్యకు కథ వినిపించే లోపే డీల్ క్యాన్సిల్ అయ్యిందని, ఒకవేళ వినిపించినా ఆయన అప్పట్లో ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల చేసేవారు కాదని ఇన్సైడ్ టాక్.
ప్రభాస్ ఎలా బుక్ అయ్యారు?
స్టార్ హీరోలు నో చెప్పిన ఈ కథలో మారుతి కొన్ని భారీ మార్పులు చేసి ప్రభాస్‌కు వినిపించారు. ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టుగా ఎలివేషన్లు జోడించడంతో డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభాస్ తన వంతుగా వన్ మ్యాన్ షో చేసినప్పటికీ, మారుతి మార్క్ మేజిక్ మిస్ అవ్వడం సినిమాకు మైనస్ అయ్యింది.

