తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన కామెడీ టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తన స్టైల్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నాడు. ఆయన కొత్త సినిమా పెళ్లి కాని ప్రసాద్ పేరుతో త్వరలోనే థియేటర్లలో సందడి చేయబోతుంది.
ఈ సినిమా మార్చి 21న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోందని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు) విడుదల చేస్తుండడం మరో విశేషం. దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా రిలీజ్ అవుతుందంటే, ఆ సినిమాపై ప్రేక్షకులలో కూడా ఓ నమ్మకం పెరుగుతుందని చెప్పవచ్చు.
పెళ్లి కాని ప్రసాద్ ఫస్ట్ లుక్‌లో సప్తగిరి 20 రూపాల్లో కనిపిస్తున్నాడు. ఒక్కో ఎక్స్‌ప్రెషన్ ఒక్కోలా.. కంగారు, ఆశ్చర్యం, కోపం, గందరగోళం, సంతోషం ఇలా అన్ని మూడ్స్‌లో అతను కనిపించడం ఆసక్తిని పెంచింది.
సప్తగిరి తన కామెడీ టైమింగ్ డైలాగ్‌లతో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేసాడు. కానీ ఈసారి కేవలం కామెడీ కాదు, క్యారెక్టర్‌లో మల్టిపుల్ షేడ్స్‌ను చూపిస్తూ, నటుడిగా తనలోని కొత్త కోణాన్ని చూపించబోతున్నాడని చెప్తున్నారు.
అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కే.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్క వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.