సైకియాట్రిస్ట్ శ్యామ్ (సత్యరాజ్) కి మనవరాలు నిధి (మేఘనా) అంటే పంచ ప్రాణాలు. తన కొడుకు, కోడలు యాక్సిడెంట్‌లో చనిపోవడంతో, నిధినే కంటికి రెప్పలా చూసుకుంటూ, ధైర్యం కోసం మహాభారతంలో యుద్దవీరుడు బార్బరిక్ కథ చెబుతూ పెంచుతుంటాడు.
అయితే ఒక రోజు నిధి స్కూల్‌కి వెళ్లి తిరిగి రాలేదు. ఫ్రెండ్స్ ఇంటి దగ్గర లేరు, డ్రైవర్ “ఇంటి దగ్గరే దించా” అంటాడు. డైరెక్ట్‌గా మిస్సింగ్ కేస్ ! పోలీసులు కేస్ కానిస్టేబుల్ చందు (సత్యం రాజేష్) కి ఇస్తారు. చందుతో కలిసి శ్యామ్ చేసే ఇన్వెస్టిగేషన్‌లో ఒక్కో నిజం బయటకు వస్తూంటుంది. ఇన్వెస్టిగేషన్‌లో ఒక్కో ట్విస్ట్ బయటపడుతుంటుంది.
ఈ క్రమంలోనే కథలోకి ఎంట్రీ ఇస్తారు రామ్ (వశిష్ఠ సింహ) , దేవ్ (క్రాంతి కిరణ్) రామ్ ఫారిన్ డ్రీమ్స్ కోసం 30 లక్షలు కావాలి . దేవ్ అయితే జూదం పిచ్చిలో పూర్తిగా అప్పుల్లో మునిగిపోతాడు. అర్జెంట్ గా బయిటపడకపోతే ప్రాణాలకే ముప్పు. ఇద్దరికి డబ్బులు డెస్పరేట్ గా అవసరం. దాంతో వాళ్ల లైఫ్ డార్క్ లేన్‌లోకి వెళ్తుంది.
మరి నిధి మిస్సింగ్‌కి వీళ్లిద్దరికీ కనెక్షన్ ఏంటి? శ్యామ్ చివరికి బార్బరిక్ మోడ్‌లోకి ఎలా వెళ్ళాడు? ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్
సినిమా మొదటి ఇరవై నిమిషాలు పక్కా థ్రిల్లర్‌కి కావాల్సిన బేస్‌లైన్ ఇస్తూ సాగతాయి. పోలీస్ స్టేషన్ సీన్స్ – ఇన్వెస్టిగేషన్, డీటెయిల్స్ – ఇవన్నీ చూసి డైరెక్టర్ థ్రిల్లర్ మెకానిక్స్‌కి ఫామ్‌లో ఉన్నాడనిపిస్తుంది. పైగా పోలీస్ సిస్టమ్‌లోని ఇన్‌ఎఫిషెన్సీని టచ్ చేసిన ఆబ్జర్వేషన్లు కూడా వర్క్ అవుతాయి. ఆ సమయంలో ఆడియన్స్ నిజంగానే “ఈ సినిమా గొప్పగా ఉండబోతోంది” అనే హోప్‌లోకి వెళ్తారు. కానీ, అక్కడే మనం పొరపాటు పడ్డామని అర్దం అవుతుంది.
సినిమా సైలెంట్‌గా, నెమ్మదిగా ఫీల్ అవ్వాల్సిన చోట, డైరెక్టర్ మాత్రం అన్నీ స్పష్టంగా విప్పి చెప్పేస్తాడు. ఉదాహరణకు బార్బరిక్ కనెక్షన్ – ఇది ఆడియన్స్ మనసులోనే ఊహించుకోవాల్సిన విషయం. వాళ్లు తమదైన విధంగా అనుభవించాలి. కానీ డైరక్టర్ శ్రీవత్స ప్రతి సింబల్‌ని “ఇదిగో చూడండి, ఇది బార్బరిక్ రిఫరెన్స్” అని హైలైట్ చేస్తూంటాడు. దాంతో subtleగా ఉండాల్సిన ఐడియా, బలవంతంగా వివరించినందువల్ల ఇంపాక్ట్ కోల్పోయింది.
అంతేకాదు సత్యరాజ్ లాంటి నటుడు చేతిలో ఉంటే, ఆయన యాక్టింగ్‌తోనే స్టోరీ ఫిలాసఫీని అండర్ కరెంట్ గా చూపించవచ్చు. కానీ ఇక్కడ ఆయనని నిజంగానే మహాభారత యోధుడిలా డ్రెస్ చేయించి, రాకింగ్ చెయిర్‌లో కూర్చోబెట్టి, విలన్స్‌ని ఎలిమినేట్ చేయాలనే ప్లాన్‌లు చేయించేలా చూపించడం – ఇది స్టోరీకి కావాల్సిన థ్రిల్లర్ టోన్‌ని డామేజ్ చేసింది. ఇమేజ్ బిల్డప్ అనే ప్రయత్నం, అసలు సబ్టిలిటీని హతమార్చింది. దాంతో ఆడియన్స్ సస్పెన్స్ కోసం సీట్ ఎడ్జ్‌లో ఉండాలి అనిపించే చోట, ఓవర్-ది-టాప్ సింబాలిజం వారిని స్టోరీ నుండి డిటాచ్ చేస్తుంది.
సినిమా మొదటి నుంచే ఓవర్‌ఎక్స్‌ప్లనేషన్‌లో పడిపోయింది. “Self-destruction”, “Hell” గురించి వచ్చే ఓపెనింగ్ కోట్ చూసిన క్షణం నుంచే డైరెక్టర్ చెప్పదలచుకున్న తాత్వికతను ప్రేక్షకుల మీద బలవంతంగా రుద్దేస్తాడు. అలా చెప్పేసిన తరువాత మిగతా జర్నీకి ఎలాంటి డెస్టినేషన్ ఉండదు. ఓపెనింగ్ కోట్, బార్బరిక్ కనెక్షన్, సత్యరాజ్ యాక్షన్ – ఇవన్నీ subtleగా ఉండే స్థానం లోకి వచ్చి వాటిని లౌడ్ గా చూపించడం, క్లాస్‌రూమ్ లెక్చర్ లా మార్చేసింది.
వర్కౌట్ అయ్యిన పాయింట్స్
- సత్యరాజ్ ఎంటైర్ పర్ఫార్మెన్స్
- సత్యం రాజేష్ ఎంట్రీతో కామెడీ + సీరియస్ షేడ్స్ బాగున్నాయి.
- ఫస్ట్ హాఫ్‌లో సస్పెన్స్ పక్కాగా హుక్ చేస్తుంది.
- ఎమోషనల్ సీన్స్ కొంతవరకు కనెక్ట్ అవుతాయి.
లాగ్ అయ్యిన పాయింట్స్
- సింబాలిజం ఎక్కువై, థ్రిల్లర్ పేస్ తగ్గిపోవడం.
- రామ్-దేవ్ ట్రాక్ కొంచెం లెంగ్త్ ఎక్కువగా అనిపిస్తుంది.
- క్లైమాక్స్ ప్రిడిక్టబుల్ ఫీల్ ఇస్తుంది.
- ఫిలాసఫీ ఎక్కువ, థ్రిల్ తక్కువ.
ఎవరెలా…
సత్యరాజ్ కు ఫిట్ అయ్యేలా ఒక టెయిలర్ మేడ్ రోల్. నటన న్యాచురల్‌గా ఉంది.ముఖ్యంగా చివరి పదిహేను నిమిషాల్లో ఆయన నటన హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే వసిష్ట సింహకు మంచి రోల్ ఇచ్చారు, చాలా బాగున్నాడు. versatility ఉన్న హీరో అనిపించుకున్నాడు. సత్యం రాజేష్ సగటు రేంజ్‌లోనే – “just about okay”. ఉదయభానుకు మంచి పాత్రే కానీ చెప్పుకునేటంత విషయం ఉన్న సీన్స్ పడలేదు.
కుషేందర్ రమేష్ కెమెరావర్క్ బాగుంది, నైట్ సీన్స్ విజువల్స్ అదిరిపోతాయి. ఇన్ఫ్యూషన్ బ్యాండ్ అందించిన BGM, మ్యూజిక్ చాలా బాగుంది. డైలాగ్స్, మిథాలజీ రిఫరెన్స్‌లు బాగానే వర్కవుట్ చేసారు.
ఫైనల్ వెర్డిక్ట్
తాత తన మనవరాలను కిడ్నాప్ చేసిన వారిని వెతుకుతూ, మహాభారత యోధుడి కథతో ప్రభావితం అవ్వడం అనేది నిజంగానే juicy pulp స్టోరి. సరైన execution ఉంటే, ఇది raw, స్ట్రేంజ్, సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యేది.