మళయాళంలో కథ, పాత్రల పరంగా నవ్యతకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తుంటారు. అదే విధంగా బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ రీమేక్ లకు ప్రయారిటీ ఇస్తూంటాడు. అవే అతనికి సక్సెస్ తెచ్చిపెట్టాయి కూడా. ముఖ్యంగా సౌత్ నుంచి వచ్చిన దర్శకులు ఆయన కెరీర్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లారు. ఆ క్రమంలో మరో సౌత్ డైరక్టర్, అదీ మళయాళ దర్శకుడుతో షాహిద్ కూపర్ చేసిన తాజా చిత్రం దేవా. క్రైమ్ ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా చెప్పుకోదగ్గ అంచనాల మధ్య రిలీజయ్యింది. పూజ హెగ్డే హీరోయిన్ కావడంతో అంతోఇంతో మనోళ్ల దృష్టి కూడా దీని మీదే ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది, కథేంటో చూద్దాం.
కథేంటి
ఐపీఎస్ ఆఫీసర్ రోహన్ డిసిల్వ (పావైల్ గులాటి) హత్యకు గురవుతాడు. అతడిని హత్య చేసింది ఎవరో కనిపెడతాడు అతని కోలీగ్ దేవ్ (షాహిద్ కపూర్).. ఆ వివరాల్ని కమీషనర్ ఫర్హాన్ (పర్వేశ్ రాణా)కు చెబుతున్న సమయంలోనే అతడికి యాక్సిడెంట్ అవుతుంది. ఆ ప్రమాదంలో దేవా గతాన్ని మర్చిపోతాడు. అయితే దేవా ఇన్విస్టిగేషన్ నైపుణ్యం, అతని తెలివితేటలపై ఉన్న నమ్మకంతో అతడికే రోహన్ మర్డర్ కేసును అతనికే తిరిగి అప్పగిస్తాడు కమీషనర్.
గతాన్ని మర్చిపోయిన దేవా ఆ మర్డర్ కేసు మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు? అసలు రోహన్ ని చంపింది ఎవరు? గతం మర్చిపోయిన దేవ్.. ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు? అసలు రోహన్ ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వుంది ? దేవ్ చివరికి హంతకుడిని పట్టుకున్నాడా ? ఇందులో జర్నలిస్ట్ గా కనిపించే పూజ హెగ్డే పాత్ర ఏమిటి అనేది మిగతా కథ.
ఎనాలసిస్
గతాన్ని మర్చిపోయిన ఓ పోలీస్ ఆఫీసర్ కథ ఇది. దాదాపు తాను సాల్వ్ చేసిన ఓ కేసును గతాన్ని మర్చిపోవడం వలన తిరిగి ఫస్ట్ నుంచి ఎలా టేకాఫ్ చేశాడనే పాయింట్‌తో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళంలో విజయం సాధించిన ‘ముంబై పోలీస్’ కథని క్లైమాక్స్ ట్విస్ట్ మార్చి, మిగతాది అలాగే ఉంచి హిందీ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం జరిగింది. అయితే మలయాళంలో ఈ సినిమా వచ్చి ఒక పన్నెండేళ్లు గడిచింది.
కోవిడ్ తర్వాత కథని ప్రేక్షకులు చూసే విధానంలో చాలా మార్పులు వచ్చాయనే విషయం మర్చిపోయి చేసిన సినిమా ఇది. క్లైమాక్స్ ట్విస్ట్ ముంబై పోలీస్ సినిమాకు బలం. ఆ ఒక్క ట్విస్ట్‌ను నమ్ముకుంటూ దాని చుట్టూ ఆ కథను అల్లుకున్నాడు డైరెక్టర్. అయితే హిందీలో ఆ ట్విస్ట్ ని మార్చేసి కొత్తది పెట్టారు. ఇప్పుడు ఆ పాయింట్‌తో హిందీ ప్రేక్షకులు ఏ మేరకు కనెక్ట్ అవుతారన్నదానిపైనే దేవా (Deva Movie Review) విజయావకాశాలు ఆధారపడ్డాయి.
ఏదైమైనా పదిహేనేళ్ల క్రితం సినిమాని చూస్తున్న ఫీల్ నే తీసుకొచ్చింది. కొత్త కథ అనిపించలేదు. ఇప్పుడు కాలానికి తగినట్లు అప్డేట్ కాలేదనిపించింది. ఆ ట్విస్ట్ రివీల్ అయ్యే విధానాన్నిఆద్యంతం ఉత్కంఠగా నడిపించడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.మలయాళ సినిమా ముంబై పోలీస్‌కు రీమేక్‌గా హంట్ సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్ వెర్షన్‌తో పోలిస్తే చాలానే మార్పులు చేశారు.
టెక్నికల్ గా …
స్క్రిప్టు మరింత స్ట్రాంగ్ గా ఉండాల్సింది. ఫస్టాఫ్ సాదాసీదాగా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత ట్విస్టులు రివీల్ అవుతాయి. సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాత పెట్టిన ఖర్చును స్క్రీన్ మీద నీటుగా అమిత్ రాయ్ చూపించారు. ప్రతి పైసా ఫ్రేములో కనబడుతుంది. ప్రతి యాక్షన్ సీక్వెన్సును సజహంగా తెరకెక్కించారు. ప్రొడక్షన్ పరంగా సినిమా డీసెంట్ గా వుంది. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ నేపధ్య సంగీతం ఓకే.
ఎవరెలా చేసారు
ఖాకీ పాత్రకు కావలసిన పర్ఫెక్ట్ ఫిజిక్ షాహిద్ కపూర్ ది. ఇప్పుడీ ‘దేవా’లోనూ ఫిట్ & ఫ్యాబులస్ గా కనిపించారు. గతం మర్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో క్లూలెస్ ఎక్స్‌ప్రెషన్స్, ఆ యాక్టింగ్ బావుంది. క్లైమాక్స్ వచ్చేసరికి క్యారెక్టర్ పరంగా షాక్ ఇస్తారు. మిగతా కీలక పాత్రలు బలంగా లేవు. పూజ హెగ్డే చేయటానికి పెద్దగా ఏమీలేదు. సినిమాటెక్ జర్నలిస్ట్ క్యారెక్టర్ , స్క్రీన్ టైమ్ తక్కువ. పర్వేష్ రాణా పాత్రతో ప్రేక్షకులని మిస్ లీడ్ చేయాలనుకునే ప్రయత్నం కొంతమేరకు వర్క్ అవుట్ అయ్యింది.
నచ్చుతుందా
క్రైమ్ ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్స్‌లో కొత్త కోణాన్ని టచ్ చేస్తూ రూపొందిన సినిమా ఇది. మలయాళ సినిమా ముంబై పోలీస్ ఆధారంగా హంట్ సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్ వెర్షన్ చూసిన వారికి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు.
బ్యానర్: జీ స్టూడియోస్, రాయ్ కపూర్, ఫిల్మ్స్
నటీనటులు: షాహిద్ కపూర్, పూజా హెగ్డే, పవైల్ గులాటీ, పర్వేష్ రానా తదితరులు
సినిమాటోగ్రఫి: అమిత్ రాయ్
ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
పాటలు: విశాల్ మిశ్రా, జేక్స్ బిజోయ్
దర్శకత్వం: రోషన్ అండ్రూస్
నిర్మాత: సిద్దార్థ్ రాయ్ కపూర్, ఉమేష్ కేఆర్ భన్సల్
రిలీజ్ డేట్: 2025-01-31