ఐదేళ్ల క్రితం ఓటీటీలో విడుద‌లైన ఐదేళ్ల‌కు థియేట‌ర్లో ఓ సినిమా వ‌స్తోంది. అదే ‘ఇట్స్ కాంప్లికేటెడ్’. సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ హీరో. ఓటీటీలో ఈ సినిమాని ‘కృష్ణ అండ్ హిజ్ లీల‌’ అనే టైటిల్ తో వ‌చ్చింది. అప్ప‌ట్లో ఓటీటీలో బాగానే వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు సిద్దు ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాని థియేట‌ర్ల‌లోకి తీసుకొస్తున్నారు. ఓటీటీలో ఇప్ప‌టికే చూసేసిన జ‌నం.. ఇప్పుడు టికెట్ కొని థియేట‌ర్‌కి వెళ్లి మ‌రీ చూస్తారా? అనేది అనుమానం. వివరాల్లోకి వెళితే..

సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా నటించిన ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ (Krishna and His Leela) సినిమా ఫబ్రవరి 14న థియేటర్‌లో విడుదల కానుంది. దీంతో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

https://youtu.be/1DN4Y5j4HXM?si=B9hZJS3sY-OLkuiS

కరోనా కారణంగా 2020లో ఆహా, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంది. సుమారు ఐదేళ్ల తర్వాత ‘ఇట్స్‌ కాంప్లికేటెడ్‌’ పేరుతో బిగ్‌ స్క్రీన్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

‘క్షణం’ సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు రవికాంత్‌ పేరపు ఈ యూత్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కించాడు.

సురేష్‌ ప్రొడక్షన్స్‌, వయకామ్‌ 18, సంజయ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌, షాలినీ వందికట్టి హీరోయిన్లుగా నటించారు.

హీరో రానా దగ్గుబాటి సోషల్‌మీడియా వేదికగా రీసెంట్‌గా ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక ఫన్నీ వీడియో చేసిన విషయం తెలిసిందే.

, ,
You may also like
Latest Posts from