దక్షిణాదిలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా (SIIMA) అవార్డ్స్‌కు ఎంతో గుర్తింపు ఉంది. సౌత్ చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారిని అవార్డ్‌తో సైమా గౌరవిస్తుంది. మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్రాల్లో అత్యంత ఎక్కువ ప్రతిభ కనబర్చిన నటీనటులు అవార్డ్స్ సొంతం చేసుకున్నారు.
సైమా విజేతలు.. వారి వివరాలు
- ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
- ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప-2)
- ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ (హనుమాన్)
- ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప-2)
- ఉత్తమ నటి : రష్మిక మందన్నా (పుష్ప-2)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజా సజ్జా (హనుమాన్)
- ఉత్తమ నటి (క్రిటిక్స్): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
- ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి)
- ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్ (కల్కి)
- ఉత్తమ నూతన నటి : భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)
- ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప -2)
- ఉత్తమ గేయ రచయిత ‘చుట్టమల్లే’ పాట కోసం: రామజోగయ్య శాస్త్రి (దేవర)
- ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్: శిల్పారావ్ (దేవర) ‘చుట్టమల్లే’ పాట కోసం
- ఉత్తమ గాయకుడు: శంకర్ బాబు కందుకూరి (పుష్ప2) ‘పీలింగ్స్’ పాట
- ఉత్తమ విలన్ : కమల్ హాసన్ (కల్కి)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్: రత్నవేలు (దేవర)
- ఉత్తమ హాస్యనటుడు: సత్య (మత్తు వదలరా 2)
- ఉత్తమ నూతన నిర్మాత : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)
- ఉత్తమ నూతన నటుడు: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)
- ఉత్తమ నూతన దర్శకుడు: నందకిషోర్ ఇమాని (35 ఒక చిన్నకథ)
- ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా : అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి)
దుబాయ్‌లో శనివారం అట్టహాసంగా జరిగిన ఈ సైమా వేడుకలో తమిళ, మలయాళ సినిమాలకు అవార్డులు ప్రదానం చేశారు.
‘అమరన్’ సినిమా ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025’ (సైమా 2025)లో పురస్కారాల పంట పండించింది. కోలీవుడ్ ఉత్తమ చిత్రంగా నిలిచిన ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా శివ కార్తికేయన్, ఉత్తమ నటిగా సాయి పల్లవి, ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్ పెరియసామి, ఉత్తమ సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్ పురస్కారాలు దక్కించుకున్నారు.
తమిళ చిత్రాలకు సంబంధించిన క్రిటిక్స్ విభాగంలో ‘సత్యం సుందరం’ సినిమాకి గానూ కార్తి ఉత్తమ నటుడిగా పురస్కారం గెలుచుకున్నారు. చిత్ర పరిశ్రమకు సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్నందుకు శివ కుమార్‌ను, 25ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్నందుకు త్రిషను ప్రత్యేక అవార్డులతో సత్కరించారు.
ఇక ఈ 13వ సైమా వేడుకల్లో మలయాళ చిత్రసీమ నుంచి ‘ఆడు జీవితం’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్, ఉత్తమ దర్శకుడిగా బ్లెస్సీ పురస్కారాలు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కమల్‌హాసన్, ఖుష్బూ, శ్రుతిహాసన్, మీనా, సుహాసిని తదితరులు సందడి చేశారు.