జైల‌ర్ డైరెక్టర్ తో జైల‌ర్ -2 మొదలు పెట్టాలని ర‌జనీ సిద్ధం అయ్యారు. ఈ మూవీ చిత్రీకరణను మార్చిలో మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే, టీమ్ షూట్ కి సన్నాహాలు చేస్తున్నారు. మొదట రజనీకాంత్ పై యాక్షన్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెట్ ను వేస్తున్నారట. ఈ నేపధ్యంలో రజనీకాంత్ కి విలన్ గా కనపడేది ఎవరు అనే విషయం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎస్ జే సూర్యను ఈ సినిమాలో రజనీకి విలన్ గా చూపించనున్నారని తమిళ సినిమా వర్గాల సమాచారం.

రీసెంట్ గా నాని చిత్రం సరిపోదా శనివారం దుమ్ము రేపారు. అలాగే తమిళంలో మార్క్ ఆంటోని చిత్రం కూడా అదరకొట్టింది. దాంతో ఈ ‘జైలర్‌ 2’లో రజనీకి విలన్ గా ఎస్ జే సూర్యని ఎంపిక చేసారని తెలుస్తోంది.

ఇక జైలర్ 2 ని తొలి భాగం కన్నా మరింత స్టైలిష్‌గా చూపించనున్నారని, అలాగే రజని లుక్ విషయంలో కూడా నెల్సన్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ‘జైలర్‌ 2’ చిత్రీకరణ గురించి త్వరలో అఫీషియల్ గా ప్రకటించనున్నారు.

2023లో రిలీజైన జైలర్ సినిమా రజినీకాంత్ కెరీర్‌లో భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్ ఇచ్చింది.

జైలర్ సినిమాను దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన తీరు, అనిరుధ్ రవిచందర్ హై వోల్టేజ్ మ్యూజిక్.. రజినీ మార్క్ స్టైల్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది.

, , , ,
You may also like
Latest Posts from