మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ లో శ్రీలీల ఒకరు. వరస పెట్టి స్టార్స్ సినిమాల్లో చేస్తున్న ఆమె తాజాగా నితిన్ సరసన రాబిన్ హుడ్ చిత్రం చేసింది. ఈ ఉగాది కానుకగా అలరించడానికి వచ్చిన ఈ లేటెస్ట్ చిత్రంలో శ్రీలీల పాత్ర సరిగా లేదంటూ సోషల్ మీడియాలో ఓ రేంజిలో ట్రోలింగ్ మొదలైంది. వెంకీ కుడుముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “రాబిన్ హుడ్” అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. మిక్సెడ్ రివ్యూలు, డివైడ్ టాక్ భాక్సాఫీస్ దగ్గర నత్త నడక నడుస్తోంది. ఈ నేపధ్యంలో శ్రీలీల పై ట్రోలింగ్ మొదలవ్వటంతో హాట్ టాపిక్ గా మారింది.
రాహిన్ హుడ్ సినిమాలో శ్రీలీల రెగ్యులర్గా బుర్ర తక్కువ కమర్షియల్ హీరోయిన్‌గా కనిపించింది. ఈ విలక్షణమైన బ్యూటీ ఇలాంటి పాత్ర ఎంచుకోవటం పట్ల ఆమె అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఆమె మంచి స్టైలింగ్‌తో అందంగా కనిపించింది కానీ రొటీన్ యాక్టింగ్ ని కంటిన్యూ చేసింది చేసింది. సెకండాఫ్‌లో కొన్ని కామెడీ పోర్షన్‌లలో ఆమె ఫ్లాట్ అయ్యింది. ఈ సినిమాలో శ్రీలీల కోసం ఎవరో డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది.
శ్రీలీల నటనకు స్కోప్ లేదు. ఆమె పాత్ర పేలవంగా వ్రాసారు. దాంతో శ్రీలీల ఇలాంటి పాత్రలు ఎంచుకుంటోంది ఏంటంటూ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఆమె తన నటనతో ప్రేక్షకులను కూడా చికాకు పెట్టింది. ఆమె పాటలకే పరిమితం చేయబడింది. దాంతో చాలా విమర్శలు వస్తున్నాయి.